జిజిహెచ్ సూపరింటెండెంట్ సుధాకర్ పై వేటు పడింది. నూతన సూపరింటెండెంట్ గా డాక్టర్ ప్రభావతిని వైద్య ఆరోగ్య శాఖ నియమించింది. నిన్న సూపరింటెండెంట్ సుధాకర్ పై తీవ్రస్దాయిలో ద్వజమెత్తిన ఎమ్మెల్యే ముస్తఫా... సుధాకర్ పనితీరు బాగోలేదని మండిపడ్డారు. తెల్లారేసరికి సుధాకర్ పై బదిలీ వేటు పడింది. సుధాకర్ ను విజయవాడ కోవిడ్ ఆసుపత్రి కి బదిలీ  చేసారు.

కాగా నిన్న ఎమ్మెల్యే వెళ్లి గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో అన్ని ఏర్పాట్లను పరిశీలించారు. కోవిడ్ చికిత్స విషయంలో జరుగుతున్న అన్ని వ్యవహారాలను ఆయన ముందస్తు సమాచారం లేకుండా వెళ్లి తెలుసుకున్నారు.  అలాగే కొందరు కరోనా బాధితులతో కూడా ఆయన మాట్లాడి అక్కడ  జరుగుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. కొన్ని చర్యలపై అక్కడ ఉన్న వైద్యులపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేసారు. దీనిపై ఆయన ఉన్నతాధికారులకు వెంటనే ఫిర్యాదు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: