16వేల అడుగుల ఎత్తులో.. ఎముకలు కొరికే చలిలో భారత ఆర్మీ వైద్య బృందం ఓ జవానుకు శస్త్ర చికిత్స విజయవంతంగా నిర్వహించింది. ప్రస్తుతం ఆ జవాను ఆరోగ్యంగా ఉన్నట్లు ఆర్మీ అధికారులు తెలిపారు.అక్టోబరు 28న.. వాస్తవాధీన రేఖ వెంబడి విధులు నిర్వహించిన ఓ సైనికుడికి తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. దీంతో అపెండెసైటిస్ చికిత్స చేయాలని ఆర్మీ వైద్యులు నిర్ధరించారు. అయితే చాపర్​లో ప్రయాణానికి వాతావరణం అనుకూలించలేదు.


 దీంతో తూర్పు లద్దాఖ్​ ప్రాంతంలో ఉన్న ఫార్వర్డ్​ సర్జికల్ సెంటర్​లోనే అపెండెసైటిస్​ ఆపరేషన్​ నిర్వహించామని అధికారులు వెల్లడించారు. ఇలాంటి ఎత్తైన ప్రదేశాల్లో వైద్యులు శస్త్ర చికిత్స చేయటం చాలా అరుదని తెలిపారు.ఫార్వర్డ్ పోస్ట్​లలోని సైనికుల ఆరోగ్యం, వసతులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టింది. దీనితో పాటు భారత ఆర్మీ మేజర్ జనరల్ మనోజ్ ముకుంద్​ నరవాణె పలుమార్లు అక్కడ పర్యటించారు. జవాన్​ల దుస్తులు, వసతి తదితర అంశాలను సమీక్షించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: