ఉగ్రవాదానికి వినాశనమే లక్ష్యం.. అలాంటి వినాశనం పై కనీసం జాలి చూపించకూడదు.. ఉగ్రవాదాన్ని ఒకటి వేళ్ళతో సహా పెకిలించి వేయాలి .. మనుషుల్ని చంపి ఏం సాధిస్తావు ? అని ఏ ఉగ్రవాదిని అయినా అడిగితే ఆ తర్వాత సమాధానం ఉండదు. ఎందుకంటే అతడికి తెలిసింది ఒక్కటే చావటం లేదా చంపటం.. అలా అతడి బ్రెయిన్ వాష్ చేస్తారు అసలు విధ్వంస కారులు. అందుకోసం అందరి మెదడులోకి ఎక్కించగలిగే ఉన్మాద ఉగ్రత్వం మతం. ఆ మతాన్ని ఆయుధంగా చేసుకుని చేస్తున్న మరణ హోమమే నేడు భారత్ - పాక్‌ మధ్య జరుగుతున్న యుద్ధం. మత విద్వేషంతో ఉగ్రవాదం బుస‌లు కొడుతోంది. కాశ్మీర్లోని పెహల్గంలో దేశం నలుమూలల నుంచి వచ్చిన పర్యాటకులను ఉగ్రవాదులు చుట్టుముట్టి మతం అడిగి మరీ కాల్చి చంపారు. అసలు ఉగ్రవాదానికి ఆ పర్యాటకులకు ఏమైనా సంబంధం ఉందా ? వారు చాలా సామాన్య పౌరులు.. వారికి పుట్టుకతో మతం వచ్చింది కానీ వారు ఎంపిక చేసుకుంది కానీ అది వారి తప్పేలా అవుతుంది.


కానీ ఉగ్రవాదులకు చంపటమే తమ మతం అన్నట్టుగా రెచ్చిపోయారు. ఆ చంపిన వాళ్లకు తాము ఎందుకు ?చంపుతున్నామో తెలియదు. అలాంటి ఉగ్రవాదులకు స్వర్గధామం పాకిస్తాన్. బిన్‌ లాడిన్ లాంటి వారిని దాచి పెట్టి అంత ధైర్యం పాకిస్తాన్ కు ఉందంటే ? అది ఎంత ఉగ్రదేమో చెప్పాల్సిన పనిలేదు. అమెరికా సహా అంతర్జాతీయ సంస్థలు టెర్రరిస్టులుగా ప్రకటించిన మసూద్ అజార్ - దావూద్ ఇబ్రహీం లాంటివారు పాకిస్తాన్ ప్రధాని కన్నా ఎక్కువ భద్రత పొందుతూ పాకిస్తాన్లో రహస్య జీవితం గడుపుతూ ఉంటారు. నిజానికి వారు పాకిస్తాన్ హై ప్రొఫైల్లో బతుకుతూ ఉంటారు.. కానీ ప్రపంచానికి మాత్రం అలాంటి వారు తమ దగ్గర లేరని చెబుతుంటారు. వారంతా ఓ ఉగ్రవాద ముఠాను నడుపుతున్నారు. ఉగ్రవాద సంస్థ లక్ష్యం ఏమిటంటే మనుషుల్ని చంపటం కానీ ఎందుకు ? చంపాలో వారికి తెలియదు చంపాలి అంతే ..!


ఉగ్రవాదులపై దాడి చేస్తే పాకిస్తాన్ తనపైనే దాడి చేసినట్లుగా ఫీల్ అయింది దాన్ని నిరూపిస్తూ జమ్ముతో పాటు సరిహద్దుల్లో ఉన్న నగరాలపై డ్రోన్లు .. ఫైటర్ జెట్లతో విరుచుకుపడుతూ భారత సాధారణ పౌరులతో పాటు సైన్యాన్ని కూడా చంపుతుంది. ప్రస్తుతం ప్రపంచంలో దేశాల మధ్య ఉద్రిక్తతలు సహజంగా మారుతున్నాయి. రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆగటం లేదు. నిజానికి యుద్దం ఆగాలని అనుకుంటే ఎప్పుడో సమస్య పరిష్కారం అయ్యేది. కానీ యుద్ధం వ‌ల్ల‌ లాభపడే దేశాలు దాన్ని అలాగే కొనసాగిలే చేస్తున్నాయి. అగ్రదేశాలు ఉక్రెయిన్  రష్యాకు వ్యతిరేకంగా పక్కలో బల్లెం గా మార్చే ప్రయత్నం చేయటం.. దానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జల్‌నెస్ కి వంతపాడటంతో రష్యా దాడులు చేసింది. ఇప్పుడు అగ్రదేశాలు పట్టించుకోవడం లేదు. ఉక్రెయిన్ సర్వనాశనం అయిపోయింది. రేపు పాకిస్తాన్ పరిస్థితి కూడా అంతే.. టర్కీ - చైనా లాంటి దేశాలు మేమున్నాం.. నీకెందుకు అని హామీ ఇస్తున్నారు ఇప్పుడు. ఆ రెండు దేశాలు హ్యాండిచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా పాకిస్తాన్ మొదలుపెట్టిన యుద్ధాన్ని భారత్ విజయవంతంగా ముగించి పాకిస్తాన్ వినాశనం చూసే అవకాశం కనిపిస్తోంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: