ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో రష్యా అమెరికాకు వార్నింగ్ ఇచ్చింది. ఉక్రెయిన్‌కు ఆయుధాల సరఫరా ఆపక పోతే తీవ్ర పరిణామాలు ఉంటాయిని అమెరికాను రష్యా హెచ్చరించింది. ఉక్రెయిన్‌ కు అమెరికా మొదటి నుంచి అండగానే ఉంటోంది. తాజాగా ఉక్రెయిన్‌కు భారీగా ఆయుధాలు సరఫరా చేస్తోంది. ఈ పరిణామంపై రష్యా మండిపడుతోంది. ఉక్రెయిన్‌కు అమెరికా ఆయుధాల సరఫరా వెంటనే ఆపాలని రష్యా అమెరికాకు అల్టిమేటమ్ జారీ చేసింది. ఆయుధాల సరఫరా ఆపకపోతే అందుకు తగిన ప్రతిఫలం అమెరికాకు దక్కుతుందని వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటికే ఉక్రెయిన్‌ కీలక నగరాలపై రష్యా దళాలు ముమ్మరంగా దాడులు చేస్తున్నాయి.  కీవ్‌లోని సాయుధ వాహనాలు తయారుచేసే కర్మాగారాన్ని రష్యా సైన్యం ధ్వంసం చేసింది. మైకొలైవ్‌లో సైనిక వాహనాల మరమ్మతుల కేంద్రాన్ని కూడా రష్యా ధ్వంసం చేసింది.డొనెట్స్‌క్‌, లుహాన్స్‌క్‌, ఖార్కివ్‌, పోల్టావా నగరాలపైనా రష్యా దాడులు ముమ్మరం చేసింది. 700 మంది ఉక్రెయిన్ సైనికులు, వెయ్యి మంది పౌరులను రష్యా బందీలుగా పట్టుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: