దేశంలో కరోనా అరికట్టే నేపథ్యంలో లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్న కరోనా మహమ్మారి భారత దేశంలో కూడా ప్రవేశించి ఇక్కడ కూడా తన ప్రతాపాన్ని చూపిస్తుంది.  ఇప్పటికే దేశ వ్యాప్తంగా దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5194కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 4,643 యాక్టివ్ కేసులు ఉండగా.. 402 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అలాగే 149 మంది ఈ మహమ్మారితో ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా దేశంలోని 70 మంది విదేశీయులకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. కరోనా సమయంలో లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే.

 

ఈ సమయంలో పోలీసులు తమ ప్రాణాలు సైతం లేక్క చేయకుండా కరోనా విసయంలో తమను తాము రక్షించుకుంటూ కోట్ల మంది ప్రాణాలు భద్రంగా ఉండేలా చూస్తున్నారు. రోడ్లు, చెక్ పోస్టులు, గల్లీల్లో కూడా పోలీసులు గస్తీ కాస్తున్నారు.  వారి సేవలు అనీర్వచనీయం అని నేతలు, సెలబ్రెటీలతో పాటు సామాన్యులు కూడా కొనియాడుతున్నారు.  తాజాగా  వీరి సేవలను గుర్తించిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం.. లాక్‌డౌన్ సమయంలో నిబద్ధతతో డ్యూటీలు చేస్తున్న పోలీసులకు బంపరాఫర్ ప్రకటించింది. ఒక్కో పోలీసుకు రూ.50లక్షల ఆరోగ్యబీమా అందించనున్నట్లు వెల్లడించింది.

 

ఈ విషయాన్ని యూపీ అడిషనల్ చీఫ్ సెక్రెటరీ అవానిష్ అవస్థి బుధవారం తెలియజేశారు. ఇది పక్కగా అమలు చేయాలని ఆయన సంకల్పించారు.  త్వరలోనే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి రాతపూర్వకంగా ఉత్తర్వులు జారీ అవుతాయని చెప్పారు. ఇటీవలే పంజాబ్ సర్కారు.. పోలీసులకు, పారిశుధ్య కార్మికులకు రూ.50లక్షల ఆరోగ్యబీమా కల్పిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: