కరోనాపై పోరాడేందుకు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు తమ వంతు ఆర్థిక సాయాన్ని ప్రకటిస్తున్నాయి. కోవిడ్‌-19 తో ఆర్థిక వ్యవస్థలు మరింత మాంద్యంలోకి కూరుకుపోతున్నాయి. ఇలాంటి సంక్షోభంలో భారతీయులను ఆదుకు నేందుకు ఆల్ఫాబెట్‌, గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ మరోసారి తన పెద్ద మనసు చాటుకు న్నారు.

 

గివ్‌ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థకు రూ.5 కోట్లు విరాళంగా ఇవ్వనున్నారు. భారతదేశంలో  రోజువారీ వేతన కా ర్మికుల కుటుంబాలకు నగదు సాయం అందించడానికి రూ.5 కోట్ల నిధులను అందించనుంది. ఈసందర్భంగా గివ్‌ ఇండియా సుందర్‌ పిచాయ్‌కు కృతజ్ఞతలు తెలిపింది.

 

మ‌రోవైపు భారత‌  ప్రభుత్వంతో పాటు దేశ ప్రజలతో కలిసి కరోనాపై పోరాడేందు సిద్ధంగా ఉన్నామని పెడిలైట్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్ భరత్‌ పూరి తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన వివిధ సహాయ చర్యలకు సహకరిస్తూనే.. తన భాగస్వాములు, ఉద్యోగుల ఆరోగ్యం, శ్రేయస్సుపై దృష్టి సారిస్తుందని వివరించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: