దేశంలో ప్రతిరోజూ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఓ వైపు లాక్ డౌన్ ప్రకటించారు. కానీ జనాలు మాత్రం ఇప్పటికీ అవగాహన లోపమో.. లేక నిర్లక్ష్యమో రోడ్లపైకి వస్తూనే ఉన్నారు.  పోలీసులు ఎన్ని రకాలుగా చెప్పి చూస్తున్నా వీరు మాత్రం తమ మొండి వైఖరి వహిస్తూనే ఉన్నారు.  ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తీరుగా పోలీసులు నచ్చచెప్పడం.. తిట్టి చెప్పడం అవసరమైతే లాఠీతో కొట్టి చెప్పడం కూడా జరుగుతుంది. తాజాగా కరోనాపై తెలంగాణలో సీరియస్ లాక్ డౌన్ వహిస్తున్న విషయం తెలిసందే.  ఈ నేపథ్యంలో నిత్యావసరాల కొనుగోలు నిమిత్తం బయటకు వచ్చే వాహనచోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, లైసెన్స్, ఆధార్ కార్డు వారి వద్ద ఉండాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ (సీపీ) సజ్జనార్ అన్నారు.

 

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్తాపూర్ లో ఇవాళ ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్‌ మీడియాతో మాట్లాడారు. అనుమతి లేకుండా, కారణం లేకుండా రోడ్లపైకి వచ్చే వాహనాలను సీజ్‌ చేసి కేసులు నమోదు చేస్తామని సజ్జనార్‌ హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండి ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నిత్యావసరాల కొనుగోలు నిమిత్తం రోడ్లపైకి వచ్చే వారిని 3 కిలో మీటర్ల లోపే అనుమతిస్తామని చెప్పారు.

 

పోలీసులు నిర్వహించే తనిఖీలకు వాహనదారులు సహకరించాలని కోరారు.  రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ప్రజలు తమకు సహకరించాలని కోరారు. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: