ప్రముఖ బాలీవుడ్ నటుడు రిషి కపూర్ కొద్దిసేపటి క్రితం ముంబైలోని ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శాస విడిచారు. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఆస్పత్రిలో చేరిన రిషి కపూర్ రెండు రోజుల క్రితమే ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. రెండేళ్ల క్రితం క్యాన్సర్ భారీన పడిన రిషి కపూర్ అమెరికాలో చికిత్స పొంది ఆ వ్యాధి నుంచి కోలుకున్నారు. రిషి కపూర్ మరణ వార్త తెలిసి బాలీవుడ్ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. 
 
ఆయనకు భార్య నీతూ కపూర్, కుమారుడు రణ్ బీర్ కపూర్, కుమార్తె రిద్ధిమా కపూర్ ఉన్నారు. రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమ మరో గొప్ప నటుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1952 సెప్టెంబర్ 4వ తేదీన ముంబైలో జన్మించిన రిషి కపూర్ తన నటనతో బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. 
 
నిన్నటి రోజున స్టార్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ అరుదైన క్యాన్సర్ తో పోరాటం చేస్తూ మృతి చెందగా ఈరోజు మరో గొప్ప నటుడు రిషి కపూర్ మృతి చెందారు. రిషి కపూర్ మరణం పట్ల అమితాబ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: