IHG

ఇన్నాళ్లుగా అన్నిపనులను మానుకొని కరోనా భయంతో ఇళ్లలోనే బిక్కు బిక్కు మనుకుంటున్న జనానికి తెలంగాణ ప్రభుత్వం శుభ వార్త తెలియజేసింది. నిన్న సాయంత్రం ఐదు గంటలకు కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్రంలో బస్సుల రవాణా గురించి విస్తృతంగా చర్చలు జరిపారు. ఈ సమావేశంలో రేపటినుండి యథేచ్ఛగా బస్సులను నడపాలి అని నిర్ణయించుకున్నారు కేసీఆర్ ప్రభుత్వం.ఈ మేరకు కేసీఆర్ తెలంగాణా రవాణా శాఖ మంత్రి శ్రీ పువ్వాడ అజయ్ గారికి ఆర్టీసీ లో బస్సులను నడిపే విషయమై నివేదికను కోరారు.

IHG

 

అయితే ఈ రోజు మంత్రి పువ్వాడ అధ్యక్షతన ఆర్టీసీ ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమావేశం జరిపి తుది నిర్ణయాన్ని కేసీఆర్ గారికి సమర్పించనున్నారు మంత్రి పువ్వాడ. ఇప్పటికే కేంద్రప్రభుత్వం ఈ నెలాఖరుకు లాక్ డౌన్ కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది అయితే తుది నిర్ణయాన్ని మటుకు ఆయా రాష్ట్రాలకు వదిలేసింది. దింతో కేసీఆర్ మంత్రిమండలి రేపటినుండి బస్సులను నడపాలని నిర్ణయించింది. గతం లో ఆర్టీసీ ని 50 శాతం నడపవలసిందిగా తెలంగాణా ప్రభుత్వం కోరగా పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా ఆర్టీసీ బస్సులను నడపడానికి నిరాకరించింది. ప్రస్తుతం పెరుతుగుతున్న గ్రీన్. ఆరంజ్ జోన్ల దృష్ట్యా ఆర్టీసీ బస్సులను నడపడానికి సుముఖత వ్యక్తం చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు . కానీ కరోనా ఎటునుండి ఎలా వస్తుందో అని లోలోపల భయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: