ఆంఫ‌న్ తుపాన్ ప‌శ్చిమ‌బెంగాల్‌ల‌ను అత‌లాకుత‌లం చేసిన విష‌యం తెలిసిందే. ఈ తుఫాన్‌తో రాష్ట్రం అత‌లాకుత‌ల‌మైంది. కోల్‌క‌తా విమానాశ్ర‌యం జ‌ల‌మ‌య‌మైంది. పంట‌లు దెబ్బ‌తిన్నాయి. ఇళ్ల‌న్నీ కూలిపోయాయి.. ఈ విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో కోల్‌కతా, బాగ్డోగ్రా విమానాశ్రయాలలో దేశీయ విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించడాన్ని వాయిదా వేయాలని  కేంద్ర ప్ర‌భుత్వాన్ని ముఖ్యమంత్రిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ కోరారు.

 

కోల్‌కతా విమానాశ్రయంలో మే 30 వరకు, బాగ్డోగ్రా విమానాశ్రయంలో మే 28 వరకు విమాన స‌ర్వీసుల‌ను నిలిపివేయాల‌ని  పౌర విమానయాన మంత్రిత్వ శాఖను అభ్యర్థించారు. కాగా, దేశీయ విమాన స‌ర్వీసులు మే 25 న ప్రారంభం కానున్నాయి. అంత‌కుముందు మే 27వ తేదీ వ‌ర‌కు ప్ర‌త్యేక రైళ్ల‌ను కూడా నిలిపివేయాల‌ని కేంద్రాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వం కోరిన విష‌యం తెలిసిందే. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: