హైదరాబాద్ లో కరోనా ఏ మాత్రం కూడా అదుపులోకి వచ్చే అవకాశాలు కనపడటం లేదు. రోజు రోజుకి కరోనా కేసులు అక్కడ వందల్లో నమోదు అవుతున్నాయి. ఇక తెలంగాణాలో కరోనా మరణాలు కూడా రోజు రోజుకి పెరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు హైదరాబాద్ లో నేటి నుంచి ఉచిత కరోనా పరిక్షలు నిర్వహిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. 

 

హైదరాబాద్‌ పరిసరాల్లో 50 వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహించడానికి గానూ రాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది. మంగళవారం నుంచి గ్రేటర్‌ హైదరాబాద్‌లో కరోనా పరీక్షలు చేస్తారు. వనస్థలిపురం, బాలాపూర్‌, కొండాపూర్‌ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరీక్షలు నిర్వహిస్తారు. ఒక్కో కేంద్రంలో 150 మందికి కరోనా పరిక్షలు నిర్వహిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: