దేశ వ్యాప్తంగా కొంత మంది అవినీతి పరుల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. అక్రమాస్తుల విషయంలో చాలా సీరియస్ గా ఉన్నాయి. తాజాగా మరో కంపెనీ మీద ఫోకస్ పెట్టారు. డెక్కన్ క్రానికల్ సంస్థకు చెందిన రు. 122.01 కోట్ల స్థిరాస్తి ని అటాచ్ చేసింది ఈడీ. రు. 264.56 కోట్ల విలువైన ఆస్తులు ఇప్పటి వరకు అటాచ్ చేసింది ఈడీ.

ఇక ఇదిలా ఉంటే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని తిరిగి చెల్లించకుండా... రుణాలను పక్కదారి పట్టించిన ఆరోపణలపై మనీలాండరింగ్ చట్టం కింద విచారణ చేపట్టిన ఈడీ... గత కొన్ని రోజులుగా విచారణ చేస్తుంది. సంస్థ ప్రమోటర్లు డీ సి హెచ్ ఎల్ పేరుతో అనేక నకిలీ కంపెనీలు సృష్టించి.. నగదు బదలాయించారని ఆరోపణలతో 2015 లో కేసు నమోదు చేసిన ఈడీ... అక్కడి నుంచి దర్యాప్తు చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: