గత కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ మహానగరాన్ని వర్షం వణికించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బెంగుళూరు నగరాన్ని కూడా వర్షాలు వణికించాయి. అయితే ఇప్పుడు ఆ ఎఫెక్ట్ చెన్నై నగరం మీద పడింది. నిన్న రాత్రి నుంచి చెన్నై నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఇప్పటికే పలు కాలనీలలో వరద నీరు చేరాయి. దాదాపు చాలా చోట్ల రోడ్లు జలమయమయ్యాయి.

తిరువాన్మియూర్, మైలాపూర్, రాయపెట్ట, అడయార్ లలో కుంభవృష్టి వర్షం కురవడంతో ఆయా ప్రాంతాల్లో చాలా కాలనీలు నీట మునిగాయి. ఇక నిలిచిన ఆ వరద నీటిని తొలగించడానికి అధికారులు చర్యలు చేపట్టారు. అంతే కాదు ఈరోజు ఉదయం 11 గంటల వరకు భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అవసరం అయితే తప్ప బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: