దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య నియంత్రణ కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేస్తూ ఆర్డినెన్స్ గెజిట్ విడుదల చేసిన కేంద్రం.. హరియాణా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ప్రాంతాలను కూడా ఈ ఆర్డినెన్స్ కిందకు తీసుకువచ్చింది. కమిషన్ చైర్మన్​గా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి స్థాయి లేదా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి అధికారి పూర్తికాలం చైర్మన్​గా వ్యవహరిస్తారు.ఎక్స్ అఫిషియో సభ్యుడిగా కేంద్ర అటవీ పర్యవరణ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి ఉంటారు. పంజాబ్, ఢిల్లీ, హరియాణా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి ప్రధాన కార్యదర్శి లేదా, పర్యావరణ సంబంధ వ్యవహారాలు చూసే కార్యదర్శి స్థాయి అధికారులు ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉంటారు.


పర్యావరణ సంబంధిత వ్యవహారాల్లో సాంకేతిక నిపుణులుగా ఉన్న ముగ్గురిని పూర్తికాలం సభ్యులుగా నియమించాలి. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నుంచి సాంకేతిక సభ్యుడు ఎక్స్ అఫిషియో సభ్యుడిగా కమిషన్​లో ఉండాలి. ఇస్రో నామినేట్ చేసిన ఒక సభ్యుడు కూడా ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఉంటారు. ఎన్జీవోల నుంచి ముగ్గురు వ్యక్తులు కమిషన్​లో సభ్యులుగా ఉంటారు. నీతి ఆయోగ్ నుంచి సంయుక్త కార్యదర్శి లేదా, సలహాదారు స్థాయి అధికారి ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: