హైద‌రాబాద్ :  రాష్ట్రంలో క‌రోనా కోర‌లు చాస్తున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప‌దిరోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తూ కేబినేట్  నిర్ణ‌యం తీసుకుంది.రేప‌టి నుంచి(బుధ‌వారం) ఉద‌యం 10 గంట‌ల నుంచి మ‌రుస‌టి రోజు ఉద‌యం ఆరుగంట‌ల వ‌ర‌కు పూర్తిస్థాయిలో  లాక్‌డౌన్ కొన‌సాగ‌నుంది.అయితే లాక్‌డౌన్ వ‌ల్ల క‌రోనా కంట్రోల్ అవుతుందా అనేది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.

ప్ర‌స్తుతం రాష్ట్రంలో క‌రోనా ఉదృతి ఎక్కువ‌గా ఉంది. ప్ర‌తి రోజు 4వేల నుంచి ఆరు వేల పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి.ఇటు మ‌ర‌ణాలు కూడా అధికంగానే సంభ‌విస్తున్నాయి. దీనిని క‌ట్ట‌డి చేసేందుకు లాక్‌డౌన్‌యే బెట‌ర్ అంటూ చాలా మంది ప్ర‌భుత్వానికి సూచ‌న‌లు చేశారు. లాక్‌డౌన్ వ‌ల్ల కేసులు మ‌ర‌ణాలు త‌గ్గేఅవ‌కాశం ఎక్కువ‌గానే ఉంది.మొద‌టి ద‌శ‌లో రెండు నెల‌ల పాటూ లాక్‌డౌన్ పెట్ట‌డంతో అప్పుడు కేసులు అధికంగా న‌మోదు కాలేదు.ప్ర‌ధానంగా స‌రిహ‌ద్దు రాష్ట్రాల మ‌ధ్య రాక‌పోక‌లు నియంత్రిస్తే క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతాయి.


లాక్‌డౌన్ లో మ‌ద్యం దుకాణాలు, బార్లు, రెస్టారెంట్ల‌కు మిన‌హాయింపు ఇవ్వ‌కూడ‌దు. ఎందుకంటే ఈ ప్రాంతాల్లో జ‌న‌స‌మూహం ఎక్కువ‌గా ఉంటుంది.ఇక మ‌ద్యం దుకాణాలు గురించి అయితే చెప్ప‌న‌వ‌స‌రం లేదు.క‌రోనా హాట్‌స్పాట్స్‌గా మ‌ద్యందుకాణాలు ఉన్నాయి.మొద‌టి ద‌శ‌లో లాక్‌డౌన్ మిన‌హాయిపుల్లో మ‌ద్యం దుకాణాల‌కు అనుమ‌తులు ఇచ్చిన త‌రువాత కేసులు ఎక్కువ‌గా న‌మోద‌వుతూ వ‌చ్చాయి. కాబ‌ట్టి ఈ లాక్‌డౌన్‌లో వీటిని పూర్తిస్థాయిలో మూసివేస్తేనే కేసులు త‌గ్గే అవ‌కాశం ఉంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు.అయితే ప్ర‌స్తుత లాక్ డౌన్ లో ఉద‌యం 6గంట‌ల నుంచి 10గంట‌ల వ‌ర‌కు మాత్ర‌మే అన్ని వ్యాపార స‌ముదాయాల‌కు అనుమ‌తులు ఉన్నాయి. మ‌ద్యందుకాణాలు కూడా ఉద‌యం 6గంట‌ల నుంచి 10గంట‌ల వ‌ర‌కు తెరిచే ఉంచాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.అయితే  మ‌ద్యం దుకాణాల‌ను పూర్తిస్థాయిలో మూసివేయాల‌ని  ప్ర‌జ‌లు కోరుతున్నారు.లాక్‌డౌన్‌పై ప్ర‌భుత్వం ఆల‌స్యంగానైనా ఇప్ప‌టికీ మంచి నిర్ణ‌యంతీసుకుంది కాబ‌ట్టి లాక్‌డౌన్ ని క‌ఠినంగా అమ‌లు చేస్తే మాత్రం క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గే అవ‌కాశం ఉంది.




మరింత సమాచారం తెలుసుకోండి: