కరోనాతో రోగులు సతమతవుంటే మరోవైపు ఆసుపత్రుల యజమానుల దోపిడికి తెరలేపారు..కార్పోరేట్ ఆసుపత్రుల నుండి చిన్న స్థాయి ఆసుపత్రులకు వరకు ఇదే పరిస్థితి కొనసాగుతోంది. లక్షల రూపాయలు లేనిదే కరోనా రోగులకు చికిత్స అందించే పరిస్థితి కనిపించడం లేదు. పాజిటివ్ సోకిన వారు ప్రాణాల మీద బీతితో ప్రైవేటు ఆసుత్రుల వైపు పరుగులు తీస్తున్నారు. దీంతో ఆసుపత్రుల యజమాన్యం కాస్ట్లీ చికిత్సకు తెరలేపి అందినంతవరకు దండుకుంటున్నారు.. అనంతరం డబ్బులు ఇవ్వందే చికిత్స లేదంటూ హుకుం జారీ చేస్తున్నారు..దీంతో పాజిటీవ్ సోకిన వారి పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారవుతోంది.ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్ నాగోలు సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి కరోనా బాధితుడి వైద్య ఖర్చులకు వేసిన బిల్లు చూసి బాధితుడి గుండె గుభేల్ మంది. నల్లొండ జిల్లాకు చెందిన ఓ  వ్యక్తి కరోనాతో ఏప్రిల్ 15న ఆసుపత్రిలో చేరారు.  గురువారం డిశ్చార్జి చేసే ముందు రూ. 24 లక్షల బిల్లు చేతికిచ్చారు. ప్రభుత్వ నిబంధల ప్రకారం రోజుకు కొవిడ్ బాధితుడికి ఐసీయూకు రూ. 9,000 ఆక్సిజన్ బెడ్ కు రూ. 700, సాధారణ వార్డుకు రూ. 4000 చొప్పున మాత్రమే తీసకోవాలి. ఇక్కడ మాత్రం రూ. 24 లక్షలు చెల్లిస్తేనే ఇంటికి పంపుతామని అనడంతో బంధువులు వైద్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: