ఈ మధ్యకాలంలో ఎక్కువగా రియల్ స్టోరీ లు తెరకెక్కించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు.. అందులో భాగంగానే నిజ జీవిత కథలు బేస్ చేసుకుని ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. అయితే తాజాగా హీరో సూర్య నటిస్తున్న జై భీమ్ సినిమా కూడా ఒక నిజ జీవిత కథ ఆధారంగా చేసుకుని తెరకెక్కిస్తున్నారు అని తెలుస్తోంది. మద్రాస్ హైకోర్టు మాజీ జడ్జ్ చంద్రు అడ్వొకేట్ గా అంటే 1993లో ఆయన కొంత మంది గిరిజన మహిళలు కోసం ఒక కేసు వాదించారు. ఈ కేసును బేస్ చేసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు అంటున్నారు. చంద్రు అనే జడ్జ్ కి తమిళనాడు వ్యాప్తంగా చాలా మంది పేరు ఉంది. ఆయన తన కెరీర్ లో 96,000 కేసులకు తీర్పు ఇచ్చారని అంటున్నారు. మరి ఈ సినిమా ఏమేరకు ఆకట్టుకుంటుంది ? అనేది వేచి చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: