హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలోని జీహెచ్ఎంసీ కార్యాల‌యం వ‌ద్ద ఆందోళ‌న చేప‌ట్టిన 32 మంది బీజేపీ కార్పొరేట‌ర్ల‌పై పోలీసులు కేసులు న‌మోదు చేసారు. సీసీటీవీ పుటేజీ ప‌రిశీలించిన త‌రువాత కార్పొరేట‌ర్ల వెంట కార్య‌క‌ర్త‌ల‌పై కూడా కేసుల‌ను న‌మోదు చేస్తామ‌ని సైఫాబాద్ సీఐ సైదిరెడ్డి వెల్ల‌డించారు.  నిన్న మంగళవారం రోజు  జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద బీజేపీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. కార్పొరేటర్లతోపాటు, కొంత  మంది బీజేపీ నాయ‌కులు,  కార్యకర్తలు జీహెచ్ఎంసీ  కార్యాల‌యంలోకి చొచ్చుకెళ్లి కార్యాల‌యంలో సామ‌గ్రిని, పూల కుండీల‌ను  ధ్వంసం చేసారు.

ముఖ్యంగా  కౌన్సిల్ జ‌న‌ర‌ల్ బాడీ మీటింగ్ నిర్వ‌హించాల‌ని, జీహెచ్ఎంసీ నుంచి తమ కార్పొరేషన్లకు రావాల్సిన నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ కార్పొరేట‌ర్లు. మేయర్ హటావో అనే నినాదాల‌తో బల్దియా ప్ర‌ధాన ఆఫీసులో బీజేపీ కార్యకర్తలు పోస్టర్లను అతికించారు. అయితే ఇవాళ తెలంగాణ పుర‌పాల‌క‌, ఐటీ మంత్రి కేటీఆర్ ట్విట్ట‌ర్‌లో జీహెచ్ఎంసీ ప్ర‌ధాన కార్యాల‌యంపై దాడి చేసిన బీజేపీ కార్పొరేట‌ర్ల‌పై, నాయ‌కుల‌పై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ట్విట్ట‌ర్ ద్వారా హైద‌రాబాద్ సీపీని కోరారు. దీంతో ఇవాళ జీహెచ్ఎంసీ అధికారులు బీజేపీ కార్పొరేటర్లపై పోలీసులకు  ఫిర్యాదును చేసారు.


మరింత సమాచారం తెలుసుకోండి: