ఇటీవల మూడేళ్ళ క్రితం వరకు మనం అవుట్ గోయింగ్ కాల్స్ చేసుకోవాలన్నా లేదా ఇంటర్నెట్ వినియోగించాలన్నా అత్యధిక ధరలు వెచ్చించి ఆ సేవలను పొందవలసి వచ్చేది. అయితే ఎప్పుడైతే రిలయన్స్ సంస్థ వారి జియో సేవలు మన దేశంలో అందుబాటులోకి వచ్చాయో, అక్కడినుండి అతి సామన్యునుడికి సైతం ఫ్రీ కాల్స్ మరియు అత్యల్ప ధరలకు ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రావడం జరిగింది. అంతేకాక జియో దెబ్బకు మిగతా ఆపరేటర్లు కూడా ధరలు భారీగా తగ్గించి దిగిరాక తప్పని పరిస్థితి. అయితే దాదాపుగా మూడేళ్ళ తరువాత రిలయన్స్ జియో సంస్థ నేడు కస్టమర్లకు భారీ షాక్ ఇస్తూ ఒక సంచలన ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. అదేమిటంటే ఇకపై తమ కస్టమర్లు జియోకి తప్పించి మరొక ఆపరేటర్ కు చేసే కాల్స్ కు గాను నిమిషానికి 6 పైసల చొప్పున వసూలు చేయనుంది. 

అయితే ఇవి ఇంటర్ లింక్డ్ యూసేజ్ చార్జీల రూపంలో వినియోగదారుడు చెల్లించాలని కోరుతూ జియో వారు కాసేపటి క్రితం పలు ప్రకటనలు రిలీజ్ చేసారు. ఇక ఈ గడిచిన మూడేళ్ళలో తమ సంస్థ ఈ చార్జీల రూపంలో రూ.13,000 కోట్ల రూపాయల వరకు చెల్లించడం జరిగిందని, అయితే ఇటీవల ట్రాయ్ వారి నూతన విధానాల ప్రకటన ప్రకారం ఈ చార్జీలు రాబోయే 2020 జనవరి తరువాత ఎత్తివేసే అవకాశం ఉందని, కాబట్టి తమ సంస్థకు ఈ మూడు నెలలపాటు ఆ చార్జీలు నెలకు రూ.200 కోట్ల రూపాయల మేర చెల్లించడం కొంత కష్టంతో కూడుకున్న పని కావడంతో, వినియోగదారులు దానిని ఎంతో సుహృద్భావంతో అర్ధం చేసుకుని ఈ చార్జీలను భరించాల్సి ఉంటుందని జియో తమ ప్రకటనలో తెల్పడం జరిగింది. అయితే దీనికి ప్రత్యామ్నాయంగా వాట్సాప్ కాల్స్ వంటివి చేసుకోవచ్చని, 

అయితే మరొక్క విషయం ఏమిటంటే, ఈనెల 10వ తేదీ నుండి తమ వినియోగదారులు ఈ విధంగా ఇతర నెట్వర్క్ లకు చార్జీలు చెల్లించాల్సిందే అని చెప్తున్న జియో వారు, ఇప్పటివరకు ఉన్న ప్లాన్స్ మరియు టారిఫ్ ల పై ఎటువంటి మార్పు ఉండదని, కానీ ఎవరైనా ఇతర నెట్వర్క్ కు కాల్స్ చేసుకోవాలంటే మాత్రం రూ. 10 నుండి మొదలయ్యే ఇతర వోచర్స్ ని కొనుక్కోవాలని, అయితే దానికి బదులుగా వినియోగదారులకు 1 జిబి డేటాని ఉచితంగా పొందవచ్చని జియో అంటోంది. మరి ఈ అధిక చార్జీల ప్రభావం రాబోయే రోజుల్లో జియో పై ఏ విధంగా ప్రభావితం చూపుతుందో చూడాలి....!!


మరింత సమాచారం తెలుసుకోండి: