ఇటీవల కాలంలో పెళ్లి అయిన కొన్నాళ్లకే మనస్పర్ధలతో విడిపోతున్న భార్యాభర్తలను ఎంతోమందిని చూస్తూ ఉన్నాం. కానీ పెళ్లి చేసుకుని ఎన్నో ఏళ్ల పాటు సాఫీగా సంసారం చేసిన తర్వాత ఇక పిల్లలు పెద్దయిన తర్వాత విడిపోయే వారు చాలా తక్కువ మంది ఉంటారు అని చెప్పాలి. ఇక్కడ ఆ జంటకు పెళ్లి 26 ఏళ్ళు గడిచింది. వారికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళు ప్రస్తుతం స్కూల్ కాలేజీ చదువులు చదువుతున్నారు. ఇక ఆ భార్యాభర్తలిద్దరూ కూడా ఎంతో అన్యోన్యంగా ఉండేవారు.


 ఇలాంటి సమయంలో వారి కుటుంబంలో ఊహించనీ ట్విస్ట్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. 26 ఏళ్ల పాటు భర్తతో ఎంతో సవ్యంగా కాపురం చేసిన భార్య చివరికి ఊహించని షాక్ ఇచ్చింది అని చెప్పాలి. భర్తకు లాటరీ దక్కడంతో ఆ డబ్బులు అన్ని తీసుకెళ్లి భార్య చేతిలో పెట్టాడు భర్త. కానీ భార్య మాత్రం ఆ డబ్బులు తీసుకుని ప్రియుడుతో కలిసి ఉడాయించింది. ఈ ఘటన థాయిలాండ్ లో వెలుగు చూసింది. థాయిలాండ్ కు చెందిన మనీత్, అంగన్ రాత్ లు భార్యాభర్తలు. వీరికి 26 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది.


 సంసారం అంతా సాఫీగా సాగిపోతుంది. ఇంతలో మనిత్ కి అనుకోని అదృష్టం వరించింది. లాటరీ ద్వారా 1.3  కోట్ల రూపాయలు గెలుచుకున్నాడు. దీంతో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కొంత భాగం ఆలయానికి విరాళంగా ఇచ్చిన సదరు వ్యక్తి మిగతాది కుటుంబ సభ్యులకు వినియోగించుకోవాలని అనుకున్నాడు. ఒక బిజినెస్ ప్లాన్ చేసి కుటుంబ సభ్యులతో లగ్జరీ లైఫ్ ప్లాన్ చేసుకున్నాడు. అయితే ఇక ఎంతో నమ్మకం ఉండడంతో భార్య చేతిలో ఈ డబ్బు మొత్తాన్ని పెట్టాడు.. ఈ క్రమంలోనే మనిత్ అందరికీ ఆనందంలో ఒక పార్టీ ఇవ్వగా.. అక్కడికి ఇక అతని భార్య ప్రియుడు కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఇలా అందరూ పార్టీలో మునిగిపోయిన సమయంలో మణీత్ భార్య కనిపించలేదు. లాటరీ డబ్బులు కూడా మాయమయ్యాయి. దీంతో జరిగింది గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు సదురు వ్యక్తి.

మరింత సమాచారం తెలుసుకోండి: