చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఐతేపల్లి వద్ద ఆదివారం  ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్న‌ది.  అయితే ఈ ప్రమాదంలో ఐదుగురు అక్క‌డిక‌క్క‌డే మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ‌డంతో ఆసుప‌త్రికి త‌ర‌లించారు.  అతి వేగంగా వెళ్తున్న కారు అదుపు త‌ప్పి ఒక్క‌సారిగా డివైడర్ ను ఢీకొట్టడంతో  మంట‌లు ఎగిసి ప‌డి ఐదుగురు  స‌జీవ ద‌హ‌న‌మ‌య్యారు.   ఈ దుర్ఘ‌ట‌నలో కారు దగ్దమ‌వ్వ‌డంతో పాటు  ఐదుగురు మరణించ‌గా.. మరొకరు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మ‌ర‌ణించ‌గా.. మ‌రో ఇద్ద‌రూ చికిత్స పొందుతున్నారు. వారిలో ఇద్ద‌రి ఆరోగ్యం ప‌రిస్థితి విషమంగా ఉందని పోలీసులు  వెల్ల‌డించారు.

మృతి చెందిన వారిలో ఏడాదిన్న‌ర చిన్నారి కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం. క్ష‌త‌గాత్రుల‌ను రుయా ఆస్ప్ర‌తికి త‌ర‌లించారని.. ప్ర‌మాదం సంభ‌వించిన‌ప్పుడు కారులో ఎనిమిది మంది ప్ర‌యాణిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కారులో ఉన్న‌ ముగ్గురినీ స్థానికులు బ‌య‌ట‌కు తీసి అంబులెన్స్‌లో రుయా ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మ‌రొక‌రు మృతి చెందారు. తిరుప‌తి రుయా ఆసుప‌త్రిలో ఇద్ద‌రు చికిత్స పొందుతున్నారు.

ఏపీ 39 హెచ్ఏ 4003 నెంబ‌ర్ గ‌ల కారులో మ‌ర‌ణించిన వారంద‌రూ ఒకే కుటుంబానికి చెందిన శ్రీ‌కాకుళం, విజ‌య‌న‌గ‌రం జిల్లాకు చెందిన వారుగా పోలీసులు భావిస్తున్నారు. మూడు రోజుల క్రితం తిరుప‌తిలో వెంక‌న్న ద‌ర్శ‌నం చేసుకుని స్వామివారిని ద‌ర్శించుకున్న త‌రువాత శ్రీ‌కాళ‌హ‌స్తికి వెళ్లుతున్న స‌మ‌యంలో ఈ ప్ర‌మాదం సంభ‌వించిన‌ది. అయితే ఈ ప్ర‌మాదం సంభ‌వించ‌డానికి కొద్ది సేప‌టికి ముందే కాణిపాకం వినాయ‌క‌స్వామిని ద‌ర్శించుకున్నారు. అతివేగ‌మే కార‌ణం అని పోలీసులు అనుమానం వ్య‌క్తం చేస్తూ ఉన్నారు. ప్ర‌మాదం చోటు చేసుకున్న స్థ‌లానికి కొద్ది మీట‌ర్ల దూరంలోనే కారు కుడివైపున‌కు తిర‌గాల్సి ఉన్న‌ది. డ్రైవ‌ర్ నిర్ల‌క్ష్యం.. అతివేగం కార‌ణంగా ఈ ప్ర‌మాదం చోటు చేసుకున్న‌ద‌ని పోలీసులు పేర్కొంటున్నారు. స‌మాచారం తెలుసుకున్న వెంట‌నే పోలీసులు ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకుని మంట‌ల‌ను ఆర్పి అందులో ఉన్న మృత‌దేహాల‌ను వెలికి తీసి.. క్ష‌తగాత్రుల‌ను తిరుప‌తిలోని రుయా ఆసుప‌త్రికి త‌ర‌లించారు.




మరింత సమాచారం తెలుసుకోండి: