
అయితే..దీనిని చాలా గోప్యంగా రెడీ చేశారు.. గతంలో 2019లో తొలిసారి మంత్రి వర్గ కూర్పు సమయంలో నూ.. చాలా రహస్యంగా ఎంపిక చేసి.. అభ్యర్థులకు కేవలం 24 గంటల ముందు మాత్రమే.. సమాచారం అందించారు. ఇప్పుడు కూడా అదే ఫార్ములాను పాటిస్తున్నారు. కానీ.. ఎందుకో.. కొన్ని పేర్లు బయటకు వచ్చాయని.. తెలుస్తోంది. వైసీపీ నేతల మధ్య ఈ పేర్లు జోరుగా హల్చల్ చేస్తున్నాయి. వీరికి బెర్త్ లు కన్ఫర్మ్ అయ్యాయంటూ.. పెద్ద ఎత్తున గుసగుస వినిపిస్తుండడం గమనార్హం. ప్రస్తుతం లీకైన జాబితా ప్రకారం.. (అంటే.. కొందరు వైసీపీ ముఖ్యుల మధ్య హల్చల్ చేస్తున్న పేర్లు) సుమారు 9 మందికి కన్ఫర్మ్ అయింది.
వీరిలో స్పీకర్ తమ్మినేని సీతారాం, పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డిశాంతి, విడదల రజనీ(చిలకలూరిపేట), కొక్కిలిగడ్డ రక్షణనిది( తిరువూరు), ప్రసన్న కుమార్ రెడ్డి(కోవూరు), డాక్టర్ సుధ (బద్వేల్), ముస్తఫా(గుం టూరు తూర్పు), కోలగట్ల వీరభద్ర స్వామి(విజయనగరం-ఈయనను ఏకంగా డిప్యూటీ సీఎం చేస్తారని అంటున్నారు. వైశ్య కోటాలో), మల్లాది విష్ణు(విజయవాడ సెంట్రల్) పేర్లు ఖాయమైన జాబితాలో ఉన్నాయని చెబుతున్నారు.
ఇక, స్పీకర్ పదవిని.. తెల్లం బాలరాజు(పోలవరం-ఎస్టీ)కి ఇవ్వనున్నట్టు ప్రచారంలో ఉంది. మరి వీరి గురించిన ప్రచారం నిజమేనా.. కాదా? అనేది తేలాలంటే.. వెయిట్ చేయాల్సిందే అయితే.. అత్యంతకీలక సీనియర్ నేతల మధ్యే ఈ పేర్లు చర్చకు వస్తున్నాయంటే.. ఖాయమనే అంటున్నారు ఇతర నేతలు. ఏదేమైనా.. ఇదివివాదం కాకుండా వీరికి కన్ఫర్మ్ అయితే.. మేలే!