కొంతమంది తాము చేసింది తక్కువే అయినా, గొప్పగా చెప్పుకుని ప్రచారం పొందడంలో ముందుంటారు. ఆ వరుసలో ముందుగా మనకు గుర్తుకు వచ్చేది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అయితే, చేసింది కూడా చెప్పుకోవడంలో కూడా విఫలమవుతున్న వ్యక్తుల్లో ఏపీ సీఎం జగన్ ముందుగా గుర్తుకు వస్తున్నారు. వాస్తవంగా చెప్పుకుంటే జగన్ పరిపాలన ఏపీకి వరంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే ప్రజా సంక్షేమంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. అంతే కాదు ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఏ ముఖ్యమంత్రి అమలు చేయని విధంగా సంక్షేమ పథకాలను జగన్ అతి స్వల్పకాలంలోనే అమలుచేసి చూపించారు. రాష్ట్ర పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా, జగన్ మాత్రం తాను ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. 

 

IHG

ఇక జగన్ తీసుకున్న నిర్ణయాలు, సంక్షేమ పథకాలు దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. అంతేకాకుండా వాటిని తమ రాష్ట్రాల్లో అమలు చేసేందుకు మిగతా రాష్ట్రాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ రకంగా జగన్ పరిపాలన జనరంజకంగా సాగుతోంది. జగన్ పాలనపై ఎన్నో ప్రశంసలు వస్తున్నాయి. అంతే స్థాయిలో విమర్శలు కూడా పెరిగిపోతున్నాయి. దీనికి కారణం జగన్ తాను చేసిన, చేయబోతున్న అంశాల గురించి ప్రచారం చేసుకోకపోవడం, దానిని గొప్పగా ప్రజల్లోకి తీసుకువెళ్లడంలోనూ జగన్ విఫలమవుతున్నారు. అయితే ఇది జగన్ విఫలం అవుతున్నారు అనే కంటే, తాను చేసింది చెప్పుకునేందుకు జగన్ ఇష్టపడకపోవడం, అది తన బాధ్యతగా భావించడంతో ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. దీనిని అలుసుగా తీసుకుని వైసీపీ రాజకీయ ప్రత్యర్ధులు జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ, ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. దీంతో ఒక రకంగా జగన్ కార్నర్ అవుతున్నారు.

 

IHG's warning to bureaucrats - The <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=HINDUS' target='_blank' title='hindu-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>hindu</a> BusinessLine

ఇక్కడ జగన్ తప్పు పట్టడానికి ఏమి లేకపోయినా, రాజకీయాల్లో లౌక్యం అనేది అవసరం. లౌక్యం ఉంటే ఎన్ని ఒడిదుడుకులు అయినా, సునాయాసంగా ఎదుర్కోవచ్చు. కానీ ఈ విషయంలో జగన్ లౌక్యం ప్రదరిసిచలేకపోవడంతో ఆయన రాజకీయంగా అనేక విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ను జగన్ ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే కెసిఆర్ ప్రతి విషయంలోనూ లౌక్యం ప్రదర్శిస్తూ ఉంటారు. తన నిర్ణయాలపై ఎక్కడా విమర్శలు తలెత్తకుండా చేయడంలో కేసీఆర్ సిద్ధహస్తులు. ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్ ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం విషయంలో ఒకేరకంగా వ్యవహరిస్తున్నా, జగన్ ఇంకా వెనుకబడి ఉన్నట్టుగానే విపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇద్దరు మంచి స్నేహితులు అనే విషయం తెలిసిందే. ఇద్దరికీ ఒకే రకమైన అభిప్రాయాలూ, నిర్ణయాలు తీసుకుంటున్నారు. 

 

IHG

ముఖ్యంగా కరోనా విపత్తు సమయంలోనూ రెండు తెలుగు రాష్ట్రాలు ఒకే విధంగా నిబంధనలు విధించి అమలు చేశాయి. అయితే మినహాయింపులు విషయంలో మాత్రం జగన్ ఒకరోజు ముందుగా మద్యం షాపులను తెరిచారు. అయితే తాను మద్యం షాపులను తెరవబోతున్నాము అంటూ జగన్ మీడియా సమావేశం నిర్వహించలేదు. అకస్మాత్తుగా మద్యం దుకాణాలు తెరిచి అభాసుపాలయ్యారు. ఎందుకంటే మందు బాబులు షాపుల వద్ద భారీ సంఖ్యలో గుమగుడడం, ఏ ఒక్కరు సామాజిక దూరం పాటించకపోవడం ఇవన్నీ జరిగాయి. దీంతో దేశవ్యాప్తంగా ఏపీ పరువు బజారున పడింది. మిగతా రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు తెరిచినా అక్కడ ఎక్కువ సంఖ్యలో షాప్ లు ఉండడంతో పెద్దగా రద్దీ కనిపించలేదు. 

IHG


కానీ ఏపీలో మధ్య నిషేధం అమలు దిశగా జగన్ ప్రభుత్వం ముందుకు వెళ్లే క్రమంలో షాపుల సంఖ్య బాగా తగ్గించడంతో పాటు ప్రభుత్వ ఆధ్వర్యంలోని షాపులను నడిపిస్తున్నారు. దీంతో కాస్త రద్దీ ఎక్కువైంది. కానీ తెలంగాణలో ఈ రోజు దుకాణాలు తెరిచారు. అయితే ఒక రోజు ముందుగానే కేసీఆర్ తెలివిగా మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణలో గుడుంబా అక్రమ మద్యం బాగా ఎక్కువైంది అని, అందుకే షాపులు ఓపెన్ చేస్తున్నాము అంటూ చెప్పారు. అయితే ఇక్కడే కేసీఆర్ తన తెలివితేటలను ప్రదర్శించారు. 

 


మద్యం షాపులను తెస్తున్నామని, అయితే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతోనే ఇలా చేస్తున్నామని చెప్పి లౌక్యం ప్రదర్శించారు. దీంతో విపక్షాలకు విమర్శలు చేసే అవకాశం దక్కలేదు. ఇదే పని జగన్ చేసినా విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇద్దరూ ఒకే రకంగా వ్యవహరించినా ముందుగా ఈ విషయాన్ని చెప్పుకోవడంలో జగన్ విఫలమయ్యారు. ఇదే కాకుండా, ప్రతి విషయంలోనూ జగన్ తాను చేసిన ఘనకార్యం కూడా చెప్పుకోవడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ, తనపై విమర్శలు చేసే అవకాశాన్ని జగన్ చే జేతులా ప్రతిపక్షాలకు ఇస్తున్నట్టు కనిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: