మ‌ళ్లీ ఇటు రాకు మ‌హ‌మ్మారి

మాకు సిగ్గు లేదు మాకు బుద్ధి కూడా లేదు..దేవుడా న‌న్ను క్ష‌మించు..ఇలా రాసే యోగ్య‌త‌నో, అర్హ‌త‌నో నాలో ఉందో లేదో తెలియ దు కానీ ఈ మ‌నుషుల‌కు మారే గుణం లేన‌ప్పుడు నాలో నిందించే ల‌క్ష‌ణం ఇప్ప‌టికిప్పుడు పోదు గాక పోదు...ఒక‌వేళ ఈ తిట్లు బా ధ్య‌త‌ను గుర్తు చేసేవే కాక‌పోతే ఈ జ‌నం న‌న్ను తిట్టుకున్నా ప‌ట్టించుకోను.. ఈ మ‌నుషుల‌పై నాకు ఒకింత బాధ్య‌త ఉంద‌న్న స్పృహ న‌న్ను ఇవాళ న‌డిపిస్తుంది..ఇదే రీతిన ఆలోచన చేయ‌మ‌ని ఆదేశిస్తుంది. ఈ అనుజ్ఞ‌నో, ఆజ్ఞ‌నో ఆత్మ‌ది..పాటించ‌డ‌మే క‌ర్త‌వ్యం..


శ‌వాలు దొర‌క లేదు.. ఆఖ‌రి చూపు చూసే భాగ్యం లేదు..అస‌లు ఎవ‌రు శ‌వం ఎవ‌రు కాలుస్తున్నారో కూడా తెలియ‌దు..మృత్యు గీతాలాప‌న‌ల్లో ఒంట‌రి అయిన మ‌నుషులు ఎంద‌రో! అయినా కూడా మేం మార‌లేదు.. మా చావు మా బతుకు అంతా క‌రోనాయే నిర్ణ‌యిస్తుంది అన్న స్పృహ మాలో కొద్దిగా కూడా లేదు. అదిగో క‌రోనా మ‌ళ్లీ విజృంభిస్తోంది..త‌స్మాత్ జాగ్ర‌త్త.. అనాథ శ‌వాలను ఒక్క‌సారి గుర్తుకు తెచ్చుకుని బ‌తికితే మేలు. భ‌యం లేన‌ప్పుడు బాధ్య‌త ప‌ట్ట‌న‌ప్పుడు ప్ర‌భుత్వాల‌ను నిందిస్తే ఏం లాభం.. నీ చావుకు ప‌రిహారం కూడా ఇవ్వ‌లేని ద‌య‌నీయ స్థితిలో ప్ర‌భుత్వాలు ఉన్న‌ప్పుడు ఎవ‌రిని నిల‌దీయ‌గ‌లం. అయినా మీరు మీలానే ఏడ్వండి.. న‌వ్వండి ఏదో ఒక‌టి చేసి దేశానికో ముప్పు తీసుకు రండి..అంతేకానీ జాగ్ర‌త్త‌లు మాత్రం పాటించ‌కండి.


దేశంలో క‌రోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.. ఈ పెరుగుద‌ల ఆందోళ‌న‌క‌రం అయిందే కానీ  మ‌న జ‌నం ఇది ప‌ట్టించుకోకుండా ఎద్దు మీద వాన‌లా తిరుగుతున్నారు. ఏదీ ప‌ట్టించుకునే ఓపిక కానీ తీరిక కానీ లేవు. అవే ప్ర‌యాణాలు ప‌రిమితి మించి ఆటోల్లో ప్రయాణాలు.. సోష‌ల్ లైఫ్ లో ఏమీ తేడా లేదు. చావు దాకా వ‌స్తే ప‌రుగులు తీసే జ‌నం బ‌త‌క‌డానికి మాత్రం జాగ్ర‌త్త‌లు తీసుకోరు. చావు పిలుపు విన్నా కూడా మ‌న జనంకు ఇప్పుడు చ‌ల‌నం లేదు. ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా భ‌యాలు మ‌ళ్లీ పెరుగుతున్నాయి.. అని డ‌బ్ల్యూ హెచ్ ఓ చెబుతున్నా మ‌న చెవిటి మేళానికి అర్థం కాదు. గ‌డిచిన వారం రోజుల వ్య‌వ‌ధిలో క‌రోనా మ‌ర‌ణాల రేటు ప్ర‌పంచ వ్యాప్తంగా 21 శాతం పెరిగినా, అమెరికాతో పోటీగా భార‌త్ లో క‌రోనా కేసుల న‌మోదు జ‌రుగుతున్నా ఇవేం ప‌ట్ట‌ని మ‌నం హాయిగా తిరుగుతూ జ‌బ్బును అంటిస్తూ చావు రేఖ‌ల లెక్కింపుల్లో అన‌వ‌స‌ర వేదాంతం వ‌ల్లిస్తాం..అనండ్రా మేరా భార‌త్ మ‌హాన్ అని!


మరింత సమాచారం తెలుసుకోండి: