ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద పారిశ్రామిక వాడ రూపుదిద్దుకో నుంది. రాష్ట్ర మంత్రి మండలి ఈ మేరకు ముసాయిదాకు పచ్చ జెండా ఊపేసింది కూడా. అన్నీ అనుకున్నట్లు జరిగితే మరో ఆరు మాసాల్లో ఈ పారిశ్రామిక వాడకు కొత్త చిత్ర పటంఏర్పడుతుంది. దాదాపు రెండు లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది ? ఎక్కడో తెలుసా ?
ఆంధ్ర ప్రదేశ్ మంత్రి మండలి నూతన జిల్లాల ముసాయిదాకు పచ్చ జెండా ఊపింది. ముసాయిదా కార్యరూపం దాల్చే అవకాశం మెండుగా ఉంది. ఎందుకంటే చిన్న చిన్న మార్పులు కోరుతున్నారు తప్ప, ఎవరూ కూడాభారీ మార్పులు కోరుకోవడం లేదు. కొత్త జిల్లాల ఏర్పాటు పై ఎక్కడ కూడా వ్యతిరేకత వ్యక్తం కాలేదు. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ విషయంలో మిన్నకుండిపోయాయి. దీంతో ప్రస్తుతం ఉన్న జిల్లాల చిత్ర పటాలు మారిపోయి,, కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీ మేరకు కొత్త జిల్లాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు.

ఆధ్యాత్మిక నగరి తిరుపతి కేంద్రంగా బాలాజీ జిల్లా ఏర్పాటు  చేయనున్నట్లు మంత్రి మండలి ముసాయిదాలో ఉంది. అందులో చూపిన వివరాల మేరకు తిరుపతి కేంద్రంగా ఏర్పాటయ్యే శ్రీ బాలాజీ జిల్లా  వైశాల్యం 9,176 చదరపు కిలోమీటర్లు ఉంది. ఈ జిల్లా జనా భా 22.18 లక్షలుగా అధికార గణాంకాలు చెబుతున్నాయి. ఈ జిల్లా పరిధిలోకి  చంద్ర గిరి, తిరుపతి, శ్రీ కాళహస్తి, సత్యవేడు, సూళ్లూరు పేట, గూడూరు, వెంకటగిరిని చేర్చారు. దీంతో ఈ నూతన జిల్లాలో ఏడు నియోజకవర్గాలు చేరినట్లయింది. సూళూరు పేట , సత్యవేడు జిల్లాల పరిధిలోఇప్పటికే శ్రీసిటీ సెజ్ ఇక్కడ ఉంది. ఈ ప్రత్యేక ఆర్థిక మండలిలో ఇప్పటికే  ఎన్నో ప్రముఖ కంపేనీలున్నాయి.క్యాడ్బరీస్ చాక్లెట్లు ఇక్కడే తయారై విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఇక్కడే రతన్ టాటాకు చెందన  టాటా స్మార్ట్ ఫుడ్స్ ఉంది. వీటితో పాటుబహుళ జాతీయ కంపెనీలు ఇసుజీ, కోబెల్ కో, హీరో హోండా, కాల్గెట్ తదితర కంపెనీలు 250 వరకూ ఉన్నాయి.  చైనా సాంకేతిక సహకారంతో భారత్ లో తయారయ్యే ఎం.ఐ, ఫోన్లు ఇక్కడి ఫాక్స్ ట్రాన్ కంపెనీలో తయారవుతున్నాయి. మరెన్నో కంపెనీలు ఇక్కడికి రానున్నాయి. ఇప్పటి వరకూ ఇక్కడ  ప్రత్యక్షంగా యాభై వేల మంది ఉపాధి పొందుతున్నారు.  శ్రీ సిటీ పక్కనే ఉన్న మాంబట్టు వద్ద  ఏపి ఐఐసి కి చెందిన  మాంబట్టు సెజ్ ఉంది.ఇక్కడ విఖ్యాతి గాంచిన ఆడిడాస్ బూట్ల తో పాటు మరోన్నో ఉత్పత్తులు ఇక్కడ తయారవుతున్నాయి. ఇక్కడి మాంబట్టు సెజ్ లో ప్రత్యక్షంగా నలభై వేల మందికి పైగా ఉపాధి పొందుతున్నారు. నాయుడు పేట సమీపంలోని మేనకూరు వద్ద కూడ ప్రత్యేక ఆర్థిక మండలి ఉంది. \అక్కడ దాదాపుగా యాభై వేల మందికి పైగా ప్రత్యక్షంగా ఉపాధిపొందుతున్నారు. పరోక్షంగా మరో రెండు లక్షల మందికి ఉపాధి లభిస్తున్నట్లు అధికార వర్గాల సమాచారం. అదే విధంగా రేణిగుంట విమానాశ్రయం సమీపంలో పారిశ్రామిక వాడను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గతంలో ప్రకటించారు ఆ వాగ్దానం కూడా కార్యరూపం దాల్చితే మరో లక్ష మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించినట్లవుతుంది. దీంతో ఆధ్యాత్మిక నగరి పేరుతో ఏర్పాటవుతున్న శ్రీ బాలాజీ జిల్లా ఆంధ్ర ప్రదేశ్ లో అతి పెద్ద పారిశ్రామిక వాడగా రూపుదిద్దుకో నుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: