ఆంధ్రప్రదేశ్లో వైసిపి అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పడిన కష్టం అంతా కాదు. మరీ ముఖ్యంగా రెండు 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ కేవలం 23 సీట్లు పరిమితమైంది. మూడు ఎంపీ స్థానాలు మాత్రమే వచ్చాయి. ఆ టైంలో పార్టీ నుంచి పలువురు కీలక నేతలు .. మాజీ ఎమ్మెల్యేలు చాలామంది పార్టీ మారిపోయారు. అసలు తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు ఉండదని చాలామంది నిర్ణయానికి వచ్చేసారు. సీనియర్ నేతలు సైతం కాడి కింద పడేశారు. అలాంటి టైం లో పార్టీ నాయకులు.. కార్యకర్తలు మరీ ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ద్వితీయ శ్రేణి నాయకులు వైసిపి అరాచకాలకు ఎదురొడ్డి పోరాటం చేసి పార్టీని నిలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేసేందుకు కూడా ఎవరు ముందుకు రాని టైంలో పోటీ చేసి పార్టీ పరువు నిలిపారు.. కొన్నిచోట్ల విజయాలు కూడా సాధించారు. అలాంటి కార్యకర్తలకు నేడు పార్టీ అధికారంలోకి వచ్చిన వేళ ఎలాంటి పనులు కావడం లేదు. కనీసం చిన్న చిన్న పనులకు కూడా ఎమ్మెల్యేలు దగ్గరికి వెళితే పనులు కావట్లేదు.
మరి దారుణమైన ఘోరమైన విషయం ఏంటంటే సొంత పార్టీ కార్యకర్తలకు పనులు చేయాలి అంటే చిన్న చిన్న పనులకు కూడా ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకుంటున్నట్టు వారు వాపోతున్నారు. గ్రామ స్థాయిలో చిన్న చిన్న పనులు కావాలన్నా కూడా ఎమ్మెల్యేలకు కమీషన్లు , లంచాలు , ముడుపులు సమర్పించుకోవలసిన పరిస్థితి. దాదాపు రెండు మూడు దశాబ్దాలుగా పార్టీ కోసం ఆ గ్రామంలో ఎంతో కష్టపడి లక్షలు ఖర్చు చేసిన నాయకులకు కూడా ఇప్పుడు ఎమ్మెల్యేలకు చేయి తడపనదే పనులు కాని పరిస్థితి నెలకొన్నాయి అంటే ఎంత దారుణమైన పరిస్థితిలు నెలకొన్నాయో అర్థమవుతుంది. వారు తమ బాధలు ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి వచ్చేసింది. ఇదే పరిస్థితి కొనసాగితే మరోసారి తెలుగుదేశం పార్టీకి 2019 ఎన్నికల్లో ఎలాంటి దారుణమైన పరిస్థితి సంభవించిందో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అదే పరిస్థితి వస్తుందన్న అభిప్రాయాలు ఇప్పుడు క్షేత్రస్థాయిలో సర్వత్ర వినిపిస్తున్నాయి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు