పసిడి ప్రియులకు భారీ షాక్.. ఈరోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. గత నాలుగు రోజులుగా నేల చూపులు చూస్తున్న ధర , ఈరోజు ఒక్క సారిగా పైకి కదిలింది. నిన్న నిలకడగా కొనసాగిన బంగారం ధర ఈరోజు మాత్రం పెరిగింది. బంగారం ధర పైకి చేరితే వెండి ధర మాత్రం అక్కడే స్థిరంగా కొనసాగింది. దీంతో వెండి రేటు 2 రోజులుగా నిలకడగానే ఉంటూ వస్తోందని చెప్పాలి. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు పూర్తిగా కిందకు వచ్చాయి...



ఈరోజు హైదరబాద్ మార్కెట్ లో బంగారం ధరలను చూస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 పైకి చేరింది. దీంతో రేటు రూ.50,230కు ఎగసింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.110 పెరిగింది. రూ. 46,050కు చేరింది. బంగారం ధర పైకి కదిలితే.. వెండి ధర మాత్రం నిలకడగానే కొనసాగింది. కేజీ వెండి ధర స్థిరంగా ఉంది. దీంతో వెండి ధర రూ. 71,300 వద్దనే కొనసాగుతోంది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీ దారుల నుంచి డిమాండ్ మాములుగా కొనసాగుతుంది. 



అంతర్జాతీయ మార్కెట్ లో ధరలను చూస్తే..బంగారం ధర తగ్గింది. బంగారం ధర ఔన్స్‌కు 0.23 శాతం తగ్గుదలతో 1846 డాలర్లకు క్షీణించింది. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. ఔన్స్‌కు 0.27 శాతం క్షీణతతో 25.46 డాలర్లకు పడిపోయింది. ధరలు పెరగడానికి చాలా అంశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు వంటి అంశాలు బంగారం ధరల పై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. రేపు ధరలు ఏ రేంజులో ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: