పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్. నేడు మార్కెట్ లో బంగారం ధరలు భారీగా పెరిగాయి.. నిన్న కాస్త తగ్గిన ధరలు ఈరోజు మాత్రం మళ్లీ పైకి కదిలింది. వరుసగా రెండు రోజులుగా బంగారం ధర పరుగులు పెడుతూనే వస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరుగుదల నేపథ్యంలో దేశీ మార్కెట్‌లోనూ పసిడి పైకి కదిలిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు..వెండి ధరలు కూడా బంగారం ధరల దారిలోనే నడిచాయి. ఇది నిజంగానే చేదు వార్త అనే చెప్పాలి.. ధరల తో ఏ మాత్రం సంబంధం లేకుండా మహిళలు మాత్రం బంగారాన్ని కొంటున్నారు.

హైదరాబాద్ మార్కెట్‌లో సోమవారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.220 పైకి కదిలింది. రూ.48,930కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.220 పెరుగుదలతో రూ.44,870కు చేరింది.. బంగారం ధరలు భారీగా పెరిగాయి.. వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి..వెండి ధర పెరిగింది. రూ.700 పరుగులు పెట్టింది. దీంతో కేజీ వెండి ధర రూ.76,000కు చేరింది.  తులం వెండి ధర దాదాపు రూ.760 వద్ద ఉందని చెప్పుకోవచ్చు.

ఇకపోతే..అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర పైకి ఎగసింది. బంగారం ధర ఔన్స్‌కు 0.37 శాతం పెరిగింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1844 డాలర్లకు చేరింది. గ్లోబల్ మార్కెట్‌లో పసిడి ధర పెరుగుదల కారణమని నిపుణులు అంటున్నారు. వెండి ధర ఔన్స్‌కు 0.42 శాతం పెరుగుదలతో 27.48 డాలర్లకు చేరింది.. బంగారం ,వెండి ధరలు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి.ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్ మొదలగు అంశాలు బంగారం ధరల పై ప్రభావాన్ని చూపిస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: