డబ్బులు ఎక్కువ సంపాదించాలని ఆలోచనతో ఫుల్ బిజీ అయి పోతున్నారు జనాలు. ఎప్పుడు పని అంటూ ఒత్తిడికి లోనవుతున్నారు.  ఈ ఒత్తిడి కారణంగా మనకు అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే ఈ ఒత్తిడిని మనం దూరం చేయాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కంటే ఇంట్లోనే కొన్ని టిప్స్ పాటిస్తే ఒత్తిడిని సులభంగా దూరం చేయవచ్చును.ఒత్తిడిని ఎలా దూరం చేయాలి.. ఎలాంటి ఆహార నియమాలు అలవాటు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

డార్క్ చాక్లెట్ : మనం డార్క్ చాక్లెట్ తినడం కారణంగా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. కోకో లో ట్రిప్టోఫాన్ అనే పదార్థం ఈ డార్క్ చాక్లెట్ లో లభిస్తుంది. ఇది సెరోటిన్ ఉత్పత్తి చేసి మన మానసిక ఒత్తిడి ని దూరం చేస్తుంది. కాబట్టి ఎప్పుడైనా ఒత్తిడికి గురైతే... వెంటనే డార్క్ చాక్లెట్ తినడం చాలా మంచి పద్ధతి.

క్యాప్సికం ; మన ఇండ్లల్లో విరివిగా లభించేది క్యాప్సికం. క్యాప్సికం తినడం వల్ల మనం ఒత్తిడికి లోనుకాకుండా ఉండవచ్చును. ఈ క్యాప్సికం లో విటమిన్ ఎ మరియు బి 6 చాలా విరివిగా లభిస్తాయి.  ఈ విటమిన్ల కారణంగా మన ఒత్తిడి తగ్గిపోతుంది.

ఒమేగా త్రీ : ఒమేగా త్రీ లభించే ఆహార పదార్థాలను తీసుకోవాలి. దీని కారణంగా మనం సులభంగా ఒత్తిడి నుంచి దూరం కావచ్చు. సల్మాన్, అవిసె గింజలు మరియు చియా సీడ్స్ లలో ఎక్కువగా ఒమేగా త్రీ లభిస్తుంది. ఈ ఒమేగా త్రీ మనం తీసుకోవడం కారణంగా ఒత్తిడిని సులభంగా తగ్గించుకోవచ్చు.

కెఫిన్  : మనం కెఫిన్ తీసుకోవడం కారణంగా కూడా... ఒత్తిడిని దూరం చేయవచ్చు. అయితే నిద్రలేమి సమస్య ఉన్నవారు మాత్రం కెఫిన్ ను తీసుకోకపోవడమే మంచిదని వైద్యులు చెబుతున్నారు. కెఫిన్ తో పాటు నట్స్, పెరుగు మరియు గ్రీన్ టీ లాంటివి తీసుకుంటే ఒత్తిడిని మనం దూరం చేయవచ్చు. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే ఎలాంటి ఒత్తిడినైనా మనం దూరం చేయవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: