కొంతమందికి కాఫీ అంటే ఎంత ఇష్టమో, మరికొంత మందికి పాలు అన్నా అంతే ఇష్టం. అయితే చాలా మంది పెద్దయ్యాక పాలు తాగడాన్ని చిన్న పిల్లల చేష్టలుగా పరిగణిస్తారు. కానీ కాఫీ, టీ కంటే పాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే కొందరికి పాలు అస్సలు పడవు. ఎందుకంటే వీరికి పాలు తాగితే వాంతులు అవ్వడం లాంటివి జరుగుతుంటాయి. అయితే పాలు నచ్చకపోతే ఎక్కువ కాల్షియం ఉన్న ఈ ఆహారాలను ప్రయత్నించండి.

కాల్షియం మానవ శరీరం బిల్డింగ్ బ్లాక్ అని మనందరికీ తెలుసు. మానవ శరీరంలో ఇతర ఖనిజాల కంటే ఎక్కువ కాల్షియం ఉంది. చాలా మంది పెద్దలకు సిఫార్సు చేయబడిన రోజువారీ కాల్షియం (RDI) ప్రతి రోజు 1,000 మిల్లీ గ్రాములు, అయితే 50 ఏళ్లు పైబడిన మహిళలు, 70 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ 1,200 మిల్లీగ్రాములు తీసుకోవాలి, అయితే 4-18 ఏళ్ల వయస్సు పిల్లలు 1,300 మిల్లీగ్రాములు తీసుకోవాలి.

పాలు మాత్రమే ఈ అవసరాన్ని తీర్చగలవని అనుకుంటే, మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు. కాల్షియం పుష్కలంగా ఉండే అనేక ఆహారాలు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని పరిశీలించి, వాటిని మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ప్రారంభించండి.

1. కిడ్నీ బీన్స్
100 గ్రాముల పచ్చి కిడ్నీ బీన్స్‌లో 140 mg కాల్షియం ఉంటుంది. ఇది మానవ శరీరానికి మంచిదని భావిస్తారు. జీర్ణ వ్యవస్థ ఒత్తిడిని తగ్గించడానికి, సులభంగా జీర్ణమయ్యేలా చేయడానికి తినడానికి ముందు దీనిని ఉడక బెట్టాలి.

2. బాదం
100 గ్రాముల బాదం పప్పులో 60 మిల్లీ గ్రాముల కాల్షియం మరియు మోనో శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి శరీర పెరుగుదలకు మేలు చేస్తాయి.

3. అంజీర్
8 అత్తి పండ్లలో 241 మిల్లీగ్రాముల కాల్షియం ఉంది. క్రమం తప్పకుండా తీసుకుంటే ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

4. పన్నీర్
100 గ్రాముల పన్నీర్ లో 680 mg కాల్షియం ఉంది. పన్నీర్ తినడానికి ఉత్తమ మార్గం పాన్ ఫ్రై లేదా పచ్చిగా తినడం. పదార్థాలను అతిగా వండడం వల్ల వాటి పోషక విలువలు తగ్గుతాయి. కాబట్టి అతిగా వండడం మానుకోవాలని సూచించారు.

5. పొద్దు తిరుగుడు విత్తనాలు
ఒక కప్పు సన్‌ఫ్లవర్ సీడ్ కెర్నల్స్‌లో 109 మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటుంది. ఈ విత్తనాలలో మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది కాల్షియం ప్రభావాలను సమతుల్యం చేయడంలో సహాయ పడుతుంది.

6. నువ్వుల గింజలు
ప్రతి రోజూ 1 టేబుల్ స్పూన్ నువ్వులు తినాలని డాక్టర్లు చెబుతారు. ఎందుకంటే ఇది మీ రోజువారీ పోషక అవసరాలను తీర్చడానికి 88 మిల్లీ గ్రాముల కాల్షియంను జోడిస్తుంది. నువ్వులలో జింక్, రాగి కూడా పుష్కలంగా ఉంటాయి.

7. బ్రోకలీ
ఒక కప్పు బ్రోకలీలో 87 mg కాల్షియం ఉంటుంది. బ్రోకలీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మూత్రాశయం, రొమ్ము, పెద్దప్రేగు, కాలేయం మరియు కడుపు క్యాన్సర్‌ను నివారిస్తుంది. ఇవి మీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. కాల్షియం అధికంగా ఉండే ఈ ఆహారాలు మీకు సరైన పోషకాహారాన్ని అందించడానికి ఉపయోగపడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: