ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలామందిని కిడ్నీలో రాళ్ల సమస్య వేధిస్తోంది. ఈ సమస్య బారిన పడితే నొప్పి తీవ్రంగా ఉంటుంది.కాబట్టి దీని లక్షణాలను ముందే కనుగొన్నప్పుడే, వీలైనంత త్వరగా డాక్టరుని సంప్రదించడం మంచిది. కానీ, ఈ సమస్యకు కొన్ని ఇంటి చిట్కాలను పాటించడం వల్ల సమస్య తగ్గడమే కాకుండా రాళ్లు త్వరగా పోతాయని చెబుతున్నారు నిపుణులు వాటి గురించి తెలుసుకుందాం.


 కిడ్నీలో రాళ్ళు సాధారణంగా కాల్షియం ఆక్సలేట్‌తో తయారవుతాయి. ఈ రాళ్ళు చిన్నవిగా ఉన్నందున, గుర్తించడానికి అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి. కానీ కొన్ని సందర్భాలలో, అవి శరీరాన్ని విడిచి మూత్రం ద్వారా విడుదల అవుతున్నప్పుడు, విపరీతమైన నొప్పిని కలిగిస్తాయి. మూత్రపిండాల రాళ్ల గురించి లైఫ్ స్టైల్ కోచ్  ల్యూక్ కౌటిన్హో  ఇటీవలే తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని విషయాలను మనతో పంచుకున్నారు. మూత్రపిండాల్లో రాళ్లను తగ్గించడానికి జీవనశైలి మార్పులు ఏవిధంగా సహాయపడతాయో ఇందులో వివరించారు.

మూత్రంలో ఉండే కాల్షియం, ఆక్సలేట్ లేదా భాస్వరం వంటి రసాయనాలతో కలిస్తే మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడతాయి. అలాగే, మూత్రపిండాలలో యూరిక్ యాసిడ్ ఏర్పడటం తరచుగా మూత్రపిండాల్లో స్టోన్స్ కు కారణమని నేషనల్ కిడ్నీ ఫౌండేషన్ ఆఫ్ అమెరికా తెలిపింది. అందుకనే కిడ్నీ స్టోన్ సమస్యలు ఉండకూడదని ఎవరైనా భావిస్తే వారు ఈ పదార్ధాలను పరిమితంగా తీసుకోవాలని  ఇక ఇప్పటికే కిడ్నీ స్టోన్స్ తో బాధపడే వారుంటే అసలు ఈ ఆహారం జోలికి వెళ్లవద్దని సూచిస్తుంది.


కోలాలో ఫాస్ఫేట్ అనే రసాయనం ఉంది, ఇది మూత్రపిండాల్లో రాళ్లకు కారణమవుతుంది. అందువల్ల, నిల్వ చేసిన ఆహారాలు మరియు పానీయాలను అధికంగా తాగవద్దు. ఉప్పు మాత్రమే కాకుండా అధిక చక్కెర, సుక్రోజ్ మరియు ఫ్రక్టోజ్ లు కూడా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడానికి కారకాలు మారే ప్రమాదం ఉంది.దీనిలో ఐరెన్, విటమిన్లు ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకని కిడ్నీలో రాళ్ళు ఉన్నవారు బచ్చలికూర తినడం మానేయాలని సూచిస్తున్నారు. ఎందుకంటే బచ్చలికూరలో ఉండే ఆక్సలేట్ రక్తంలోని కాల్షియంతో కలిసిపోతుంది. అందుకని మూత్రపిండాలు దానిని ఫిల్టర్ చేయలేవు . ఇది శరీరం నుండి మూత్రం ద్వారా బయటకు వెళ్ళదు, దీనివల్ల మూత్రపిండాలలో నిల్వ ఉండి చక్కటి రాళ్ళు ఏర్పడతాయి

మరింత సమాచారం తెలుసుకోండి: