ఇప్పటి వరకు పరువు హత్యలు భారత్ లో చూసి నివ్వెరపోయింది వారందరు, అవన్నీ మన దేశంలో మాత్రమే జరుగుతాయని అనుకునేవారు. కానీ తాజాగా పాకిస్తాన్ లో కూడా అలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురిని తగలబెట్టేశారు. దానికి కారణం కూడా ప్రేమ వ్యవహారమే. ఇద్దరు వేర్వేరు మతాల వారు వివాహానికి పూనుకోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక కుటుంబం ఇదంతా నచ్చక, తమ తోటివారిని అందరిని ఒక్కచోట చేర్చి తలగలబెట్టేశారు. అంటే మనదేశంలోనే కాదు అన్ని జరుగుతున్నాయిలే అని విశ్రాంతిగా ఆలోచించడం కాదు ఈ ఘటన సందర్భాన్ని ఇక్కడ ప్రతిపాదించడం వెనుక అసలు కారణం, ఇవన్నీ సమాజానికి సంబందించినవి, ప్రతి కులం, మతం లాంటివి ఉన్నంతకాలం ఇవన్నీ జరగాలని కాదు, ఎక్కడో ఉంటారు కొందరు మూర్ఖులు వాళ్ళ వలన ఇవన్నీ తప్పవు.
సమాజంతో ముడిపడిన వాటిని వ్యక్తులతో, వ్యక్తులతో ముడిపడిన వాటిని సమాజంతో ముడిపెట్టి చూస్తే అవి సరిగా అర్ధం కావు. ఒక పరిస్థితిని సరిగ్గా అర్ధం చేసుకున్నప్పుడే దానిని మూలాలు తెలుస్తాయి, అప్పుడే అలాంటి మూలాల జోలికి లేదా అటువంటి పరిస్థితులలోకి మనం జారిపోకుండా మనల్ని మనం హెచ్చరించుకుంటూ, సరిచేసుకోవడం జరుగుతుంది. అలా వ్యక్తిలో మార్పులు వస్తే, సమాజం అదే మారిపోతుంది. ఎందుకంటే, సమాజం అంటే వ్యక్తుల సమూహమే కాబట్టి.