నక్షత్ర తాబేళ్లు ఓ అరుదైన జాతి. ఇప్పుడు ఈ అరుదైన తాబేళ్లకు ముప్పు వచ్చిపడింది. విదేశాలలో మంచి డిమాండ్ ఉన్న ఈ తాబేళ్లను స్మగ్లర్ లు గాలం వేసి  ఖండాంతరాలకు కూడా తరలిస్తున్నారు. విజయవాడ రైల్వే స్టేషన్ లో ఈ వలపన్ని పట్టుకున్నారు డిఆర్వో అధికారులు. ఈ జాతి తాబేళ్లు ఆంధ్రప్రదేశ్ లోని నల్లమల అడవులు కొండలలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ప్రకాశం జిల్లాలోని కనిగిరి, పామూరు, దర్శి కొండలో నక్షత్ర తాబేళ్ల ఆవాసయోగ్యమైన ప్రదేశంగా అనిపిస్తుంది. 


ఈ తాబేళ్లకు ఉన్న విశిష్టతే ఉనికికి ముప్పు తెచ్చి పెట్టింది. నక్షత్ర తాబేళ్ల మాంసం రక్తం ఆయుర్వేద మందులలో ఉపయోగిస్తారనే ప్రచారం బాగా సాగుతోంది. అంతేకాదు వీటిని గృహ వాస్తుకు ఉపకరిస్తుందనే నమ్మకాలు ఉండడంతో నక్షత్ర తాబేళ్లను స్మగ్లింగ్ మాఫియా టార్గెట్ చేసింది. లోకల్ స్మగ్లర్ లు ఒక్కో తాబేలుకు రూ.300 రూపాయల దాకా చెల్లించి మరీ కోనుగోలు చేస్తున్నారు . ఈ తాబేళ్ళకు అత్యంత అనుకూలంగా రేల్వే రవాణాను ఎంచుకుంటున్నారు స్మగ్లర్లు.


చిన్న సైజులో ఉండే ఈ తాబేళ్లు రవాణా కూడా అనుకూలంగా ఉండడంతో ఈజీగా దేశ సరిహద్దులు దాటిస్తున్నారు. తాజాగా విజయవాడ రైల్వే స్టేషన్ లో రెండు సూట్కేసులలో తరలిస్తున్న 500 నక్షత్ర తాబేళ్లను పట్టుకున్నారు. అనంతపురం జిల్లా కదిరికి చెందిన ఓ వ్యక్తి నుంచి ఈ తాబేళ్లను స్వాధీనం  చేసుకొని అటవీ శాఖాధికారులకు పోలీసులు  అప్పగించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: