ప్రస్తుత కాలంలో డబ్బులు ఉంటే అన్ని మనం ఉన్న చోటికే తెప్పించుకునే పరిస్థితి వచ్చింది. అంతేకాకుండా రోజురోజుకీ పెరుగుతున్న టెక్నాలజీ పరంగా మనిషి యొక్క మానసిక పరిస్థితి కూడా చాలా మారింది. ఫాస్ట్ ఫుడ్, ఫాస్ట్ కల్చర్ ఇలా అన్ని ఫాస్ట్ ఫాస్ట్ గా జరుగుతుంటే మనిషి యొక్క జీవితకాలం కూడా ఫాస్ట్ గా కరిగిపోతోంది. ఇక అసలు విషయానికి వస్తే... 

 


చాలామంది ప్రస్తుత రోజుల్లో నిద్ర సమస్య ఎక్కువగా భావిస్తుందని చెప్పవచ్చు. పని ఒత్తిడి వల్ల లేక ఏ ఇతర ఈ కారణాల చేతనో  ఇలాంటి సమస్యలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. మామూలుగా పిల్లలకి ఎప్పుడైనా రాత్రులు అన్నం తినకుండా ఉంటే చాలు మనం కాస్త అన్నం లేదా పాలు తాగి పడుకో లేకుంటే అర్ధరాత్రి ఆకలేస్తుంది అని పిల్లలకి చెబుతూ ఉంటాము. కానీ ఇది నిజమే అని పిల్లలు దానికి ఒప్పుకుంటారు. కాకపోతే ఇప్పుడు అది కొన్ని పరిశోధనల ద్వారా తప్పని తెలుస్తోంది. నిజానికి రాత్రులు నిద్ర పట్టనప్పుడు ఉపవాసం ఉంటే మంచిదని అమెరికాలోని న్యూయార్క్ పరిశోధనలో కొత్త విషయాలు వెల్లడయ్యాయి. రాత్రి పూట చేసే ఉపవాసంతో మనిషి ప్రశాంతంగా నిద్ర పోతారని వారు చేసిన పరిశోధనలో తేలింది. దీనితో పాటు అలా ఉపవాసంతో పడుకున్న వారిలో దాదాపు 500 కేలరీలు ఖర్చు అవుతాయట.

 

న్యూయార్క్ పరిశోధకులు 21 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న కొందరు వ్యక్తులను పరిశోధనగా తీసుకున్నారు. వారికి కొన్ని రోజులపాటు కడుపునిండా ఆహారం అలా మొదలగునవి సంపూర్ణంగా ఇచ్చారు. ఇక ఆ సమయంలో వారు ఎలా నిద్రపోతున్నారు అన్న విషయాన్ని కూడా వారు గమనించారు. ఇక అలాగే కొన్ని రోజుల పాటు కేవలం నీరు మాత్రమే ఇస్తూ రాత్రి వారు ఎలా నిద్రపోతున్నారు అనే విషయాన్ని గమనించారు. దీనితో ఆశ్చర్యం గొలిపే కొన్ని విషయాలు వారికి తెలిసాయి. కడుపునిండా తిన్నప్పటితో పోలిస్తే ఆహారం తీసుకోని అప్పుడే వారికి బాగా నిద్ర పట్టిందా అని వారు చేసిన పరిశోధనలో తేలింది. కాబట్టి రాత్రిళ్లు తక్కువ తిని నిద్రపోతే నే నిద్రలేమి సమస్యలకు పెట్టొచ్చు అంటున్నారు వారు. కాబట్టి ఎవరైనా అధిక బరువు సమస్యతో ఉన్నవారు ఇలా రాత్రి పూట కాస్త తక్కువగా భోజనం చేసి నిద్రపోతే హాయిగా ప్రశాంతంగా నిద్ర పోవడంతో పాటు వారి దైనందిన జీవితం కూడా ప్రశాంతంగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: