
రెండు వత్తులు వేసి దీపారాధన చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కి ఎంతో ఇష్టమైన పిండి దీపాన్ని వెలిగించి ఆవు నేతితో ఆ దిపాలను వెలిగించి ఆయనకు ఎంతో ఇష్టమైన విభూదిని నుదుట పెట్టుకొని ఆయనను పూజించడం ద్వారా ఉత్తమమైన ఫలితాలు లభిస్తాయి అని పండితులు చెప్తున్నారు. కృత్తికా నక్షత్రం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం ద్వారా అనేక విశేషమైన లాభాలు పొందుతారని చెబుతున్నారు . సుబ్రమణ్య స్వామికి కృత్తిక అంటే చాలా చాలా ఇష్టం . కృత్తికా నక్షత్రం రోజున ఆయనను స్పెషల్గా పూజిస్తూ ఉంటారు . అంతేకాదు కృత్తిక రోజున ఉపవాసం ఉండడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అని .. సుబ్రమణ్య స్వామి కరుణ కటాక్షాలు పొందవచ్చు అని కొందరు పండితులు చెప్తున్నారు. అంతేకాదు కృత్తికా నక్షత్రం రోజున ముందు రోజు రాత్రి ఆరోజు రాత్రి కూడా బ్రహ్మచర్య పాటించడం చాలా చాలా ఉత్తమ కాగా చాలామంది మనకు చెబుతూ ఉంటారు సుబ్రమణ్యేశ్వర స్వామికి పండితులు చెప్పుతూ ఉంటారు.
సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళు ఆయనకి పూజలు చేస్తే పిల్లలు కలుగుతారు అని ఎప్పటి నుండో నమ్ముతుంటారు జనాలు. సుబ్రమణ్యేశ్వర స్వామికి తొమ్మిది వారాల పాటు .. పిండి దీపం చేసి పెట్టి ఆయనకు ఎంతో ఇష్టమైన బెల్లాన్ని నైవేద్యంగా పెట్టి నియమనిష్ఠలతో పూజలు చేస్తే ఖచ్చితంగా ఆయన వాళ్లకి సంతానం కలుగజేస్తాడు అని ఓ నమ్మకం. మరీ ముఖ్యంగా చాలామంది కొడుకే కావాలి అనుకున్న వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు. మనం కూడా మన చుట్టుపక్కల ఇది వినే ఉంటాం. మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ముడుపు కట్టుకుంటే కొడుకు పుడతాడు అని.. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్లి ప్రదక్షిణ చేస్తే కొడుకే పుడతాడు అని..కచ్చితంగా ఆయన వారసుడే ఇస్తాడు అని చాలామంది చెప్తూ ఉంటారు . కానీ ఇదంతా కొట్టి పడేస్తున్నారు పండితులు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నియమ నిష్ఠలతో పూజిస్తే ఆయన ఏ కోరికైనా తీరుస్తాడు . కొడుకే పుట్టాలి అని కాదు కూతురే పుట్టాలి అని కాదు.. సంతాన భాగ్యం ఖచ్చితంగా లభిస్తుంది అంటూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నియమనిష్ఠులతో పూజలు చేయాలి అని చెప్తున్నారు. అంతేకాదు ఎవరైతే ఉత్తమ సంతానం కోరుకుంటున్నారో వారు కచ్చితంగా సుబ్రమణ్య స్వామికి తొమ్మిది వారాలపాటు మంగళవారం ప్రత్యేకంగా పిండి దీపం వెలిగించి ధూప దీపాలతో ఆయనను పూజిస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అంటున్నారు..!!
ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః
గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ పెద్ద వ్యక్తులు పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే అని పాఠకులు గుర్తుంచుకోవాలి. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. ఇది ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం మాత్రమే అని గుర్తుపెట్టుకోండి..!