
పెళ్లి అనంతరం చాలామంది మహిళలు బరువు పెరుగుతుంటారు. దీనికి అనేక కారణాలు ఉన్నప్పటికీ, కొన్ని ముఖ్యమైన శారీరక, మానసిక, హార్మోన్ల మార్పులు, జీవనశైలి మార్పులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. పెళ్లి తర్వాత, ముఖ్యంగా గర్భధారణకు ముందు లేదా తర్వాత హార్మోన్లలో కొన్ని మార్పులు వస్తాయి. ప్రొజెస్టిరోన్, ఎస్ట్రోజెన్, మరియు ఇంకి హార్మోన్ల అసమతుల్యత వల్ల మెటాబాలిజం మందగిస్తుంది, ఫ్యాట్ స్టోరేజ్ ఎక్కువ అవుతుంది. పిల్లు పుట్టిన తర్వాత హార్మోన్ల సమతుల్యత తిరిగి రావడానికి సమయం పడుతుంది. పెళ్లి తర్వాత చాలా మంది మహిళలు తమ భర్త, కుటుంబ సభ్యుల పద్ధతులకు అనుగుణంగా ఆహారపు అలవాట్లు మార్చుకుంటారు.
ఎక్కువగా కార్బోహైడ్రేట్లు, తీపి పదార్థాలు, ఆయిల్ ఎక్కువ ఉన్న వంటలు తినడం వల్ల బరువు పెరుగుతుంది. కుటుంబ బాధ్యతల కారణంగా తమ భోజనం ఆలస్యం అవుతుంది లేదా అసమయానికి తినే అలవాటు ఏర్పడుతుంది. రాత్రిళ్ళు ఆలస్యంగా భోజనం చేయడం లేదా డిన్నర్ తర్వాత వెంటనే పడుకోవడం వల్ల జీర్ణక్రియ మందగించి బరువు పెరుగుతుంది. పళ్లికి ముందు కొంతమంది వ్యాయామం చేస్తూ ఫిట్‌గా ఉండే అవకాశం ఉంటుంది. పెళ్లి తర్వాత బాధ్యతలు పెరగడం, సమయం లేకపోవడం వంటివి ఫిజికల్ యాక్టివిటీ తగ్గడానికి దారితీయవచ్చు. పిల్లు పుట్టిన తర్వాత హార్మోన్ల సమతుల్యత తిరిగి రావడానికి సమయం పడుతుంది.
గర్భం ధరించే సమయంలో సగటున 10-20 కిలోల వరకు బరువు పెరగడం సహజం. ప్రసవానంతరం కూడా కొంతమంది మహిళల్లో బరువు తగ్గడం సులభంగా జరగదు. సీజేరియన్ జరిగితే వ్యాయామం ఆలస్యమవుతుంది, ఫిట్‌నెస్ తిరిగి పొందడంలో జాప్యం అవుతుంది. పెళ్లి తర్వాత కొత్త కుటుంబంతో కలిసికాల్చుకోవడం, గర్భధారణ, పిల్లల సంరక్షణ వంటివి ఒత్తిడిని పెంచుతాయి. నిద్ర తక్కువ అవ్వడం వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతినడం, ఆకలి పెరగడం వల్ల ఎక్కువ తినడం జరుగుతుంది. ఒత్తిడిలో, డిప్రెషన్‌లో ఉన్నప్పుడు చాలా మంది తీపి పదార్థాలు లేదా ఫావరెట్ ఫుడ్ ఎక్కువగా తింటారు.