మాస్ మహరాజ్ రవితేజ ఈ ఇయర్ మొదట్లో క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. రాజా ది గ్రేట్ తర్వాత కెరియర్ లో హిట్టు కోసం కష్టపడుతున్న మాస్ రాజాకు సరైన టైం లో సరైన హిట్ గా క్రాక్ వచ్చింది. గోపీచంద్ మలినేని డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో పోతురాజు వీరశంకర్ పాత్రలో రవితేజ అదరగొట్టాడు. కెరియర్ లో హిట్లు లేక దాదాపు పని అయిపోయింది అనుకున్న వారందరికి గూబ అదిరిపోయేలా ఆన్సర్ ఇచ్చాడు రవితేజ.

ఇక ఇదే ఊపుతో వరుస సినిమాలు చేస్తున్నాడు. లేటెస్ట్ గా రవితేజ రమేష్ వర్మ డైరక్షన్ లో ఖిలాడి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో కూడా రవితేజ తన సత్తా చాటుతాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత నక్కిన త్రినాథ రావు డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు రవితేజ. ఈ సినిమాకు సంబందించిన ఎనౌన్స్ మెంట్ రీసెంట్ గా వచ్చింది. ఇక ఈ సినిమా కు రెమ్యునరేషన్ గా భారీ మొత్తాన్ని డిమాండ్ చేశారట రవితేజ.

ఇన్నాళ్లు ఫ్లాపుల్లో ఉన్న తనకు అడిగినంత ఇవ్వడానికి వెనుకాడిన నిర్మాతలు ఇప్పుడు రవితేజ ఎంత డిమాండ్ చేస్తే అంత ఇచ్చేందుకు రెడీ అయ్యారట. క్రాక్ హిట్ తో తన రెమ్యునరేషన్ పెంచేశాడట రవితేజ ఇన్నాళ్లు 13, 14 కోట్ల దాకా డిమాండ్ చేసే రవితేజ ఇప్పుడు 16 కోట్లు ఇస్తేనే సినిమా అనేస్తున్నాడట. త్రినాథ రావు సినిమాకు  పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు రవితేజ అడిగినంత ఇస్తున్నారట. ఈ రెమ్యునరేషన్ కారణంగానే మారుతి సినిమా మిస్ చేసుకున్నాడు రవితేజ. ఆ సినిమాలో రవితేజ స్థానంలో గోపీచంద్ వచ్చాడు. ఇప్పుడు ఆ సినిమాకు పోటీగా రవితేజ నక్కిన త్రినాథ రావుతో సినిమా చేస్తున్నాడు.                 

మరింత సమాచారం తెలుసుకోండి: