మాస్ రాజా రవితేజ ఇప్పుడు మూడు సినిమాలను సెట్స్ పైన ఉంచిన విషయం తెలిసిందే. రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి అనే సినిమాను ఎండింగ్ స్థాయికి తీసుకు వచ్చాడు రవితేజ. మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్ లు గా నటిస్తున్న ఈ సినిమా కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు.  అయితే ఈ చిత్రం పూర్తి కాకముందే శరత్ మండవ దర్శకత్వంలో రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాను కూడా మొదలు పెట్టాడు. ఈ చిత్రం షూటింగ్ శెరవేగం గా జరుపుకుంటూ ఉండగా 50 శాతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుందని చెబుతున్నారు. తమిళంలో కొన్ని సినిమాలతో మంచి గుర్తింపు దక్కించుకున్న ఈ దర్శకుడు తెలుగు లో తొలిసారి సినిమా చేస్తున్నాడు.

అలాగే రవితేజకు సంబంధించిన మరో సినిమా కూడా అధికారికంగా ప్రకటన జరిగింది. త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో రవితేజ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన నిన్న రాగా అది అభిమానులను ఎంతగానో సంతోషపెట్టిన వార్త అయింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రవితేజ గత మూడు సినిమాలుగా ఒక్క స్టార్ డైరెక్టర్ తో కూడా సినిమా చేయకుండా ఉన్నాడు. గోపీచంద్ మలినేని ఓ స్థాయి దర్శకుడే అయినా కూడా ఆయనకు స్టార్ డం క్రాక్ సినిమాతోనే వచ్చింది.

కాబట్టి ఆయనను స్టార్ డైరెక్టర్ గా పరిగణలోకి తీసుకోలేము. ఇప్పుడు ఆయన చేస్తున్న మూడు సినిమాల దర్శకులు కూడా ఓ మోస్తారు సినిమాలు చేసే దర్శకులే. ఇతర హీరోలు పాన్ ఇండియా సినిమాలు అంటూ పెద్ద దర్శకుల తో దూసుకుపోతుంటే తను మాత్రం ఇంకా మినిమం దర్శకులతోనే సినిమాలు చేస్తూ ఉన్నాడు.  ఇంకా ఎప్పుడు పెద్ద దర్శకులతో సినిమాలు చేసి పెద్ద హీరో అనిపించుకున్నాడు అని రవితేజను ప్రశ్నిస్తున్నారు. మరి రవితేజ రాబోయే సినిమాలతో అయినా స్టార్ దర్శకులతో సినిమాలు చేస్తూ కెరీర్ను ఇంకా పైకి తీసుకు వెళతాడా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: