తెలుగు తెరపై ఎంతో గొప్ప నట ప్రస్థానం సావిత్రి గారిది. ఆమె సినిమా జీవితం ఎంతోమందికి ఆదర్శప్రాయం అయితే ఆమె వ్యక్తిగత జీవితం మాత్రం చాలా వివాదాస్పదం. ఆమె చివరి రోజుల్లో ఎంత బాధ అనుభవించిందో చాలామంది ఇప్పటికి చెప్పుకుంటారు.అయితే ఆమె బయోపిక్ సినిమా అంటే అందరికి ముందుగా భయం వేసింది. కమర్షియల్ హంగుల్లో పడి సావిత్రి గారి కథని మారుస్తారేమో అని అందరూ అనుకున్నారు కానీ డైరెక్టర్ నాగ అశ్విన్ తీసిన మహానటి సినిమా చూసాక అందరి నోట ఒకటేమాట. ఇంత అద్భుతంగా ఎలా తీశారు అని . మహానటి సినిమాలో సావిత్రి గారి పాత్ర పోషించిన కీర్తి సురేష్ కి ఈ సినిమా ఎక్కడలేని క్రేజ్ ని తీసుకొచ్చింది.

ఒక్క తెలుగులోనే కాదు ఇండియాలో బెస్ట్ బయోపిక్ సినిమాల్లో మహానటి కచ్చితంగా మొదటి వరసలో ఉంటుంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ ని చూస్తే అచ్చం సావిత్రి గారిలాగానే  ఉన్నారు అని చాలా సన్నివేశాల్లో అనిపిస్తుంది. ఇక ఈ సినిమా విజయం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే సావిత్రి గారి బయోపిక్ అనగానే చాలామంది ఈ సినిమాకి మంచి పేరు వచ్చిన కూడా కలెక్షన్స్ అంతగా రావు అని ట్రేడ్ అనుకుంది. అయితే ఈ అంచనాలు అన్నిటిని తలకిందులు చేస్తూ మహానటి సినిమా ఏకంగా 40 కోట్లకి పైగా షేర్ ని సంపాదించి ఆ ఏడాదిలోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

సినిమా విజయం చాలామంది కొత్త కథలు చేయాలని అనుకునేవారికి పెద్ద ధైర్యంన్ని ఇచ్చింది.అప్పటిదాకా సావిత్రి గారి కష్టాలు మాత్రమే విన్నవారికి మహానటి సినిమా ఆమె జీవితాన్ని కళ్ళకి కట్టినట్టు చూపించింది. ఈ సినిమాతో కీర్తి సురేష్ కి నేషనల్ అవార్డ్ రావడం మనకు పెద్ద విశేషంగా ఏమి అనిపించదు. సావిత్రి పాత్రలో ఆమె నటించింది అనడం కన్నా జీవించారు అనొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: