టాలీవుడ్ సినిమా పరిశ్రమలో సహాయక నటి సురేఖ వాణికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇటీవల కాలంలో ఆమె తన కూతురుతో కలిసి చేస్తున్న ప్రచారం అంతా ఇంతా కాదు. గతంలో లేని విధంగా ఆమె ఇప్పుడు మంచి పాపులారిటీ దక్కించుకుంటుంది. ఎక్కువగా అక్క పాత్రలలో వదిన పాత్రలలో కనిపించే ఆమె తాను చేసే పాత్రలతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తుంది. దాదాపు ప్రతి తెలుగు సినిమా లో ఆమెకు ఓ పాత్ర ఉంటుంది. 

అందరి హీరో లతో దర్శకుల తో నిర్మాతల తో సన్నిహితం గా ఉండే ఆమె  ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో అందాల రచ్చ చేస్తూ ఉందని చెప్పాలి. 1981 వ సంవత్సరంలో జన్మించిన ఈమె తెలుగు సినిమాలలో ప్రముఖమైన నటిగా ఎదిగింది. తొలుత యాంకరింగ్ చేస్తూ ప్రేక్షకుల కళ్ళలో పడ్డ సురేఖవాణి ఆ తర్వాత సినిమాలలోకి ప్రవేశించింది. ఇక అప్పటి నుంచి ఆమె తిరిగి చూసుకోలేదు. ప్రతి సినిమా లో మంచి మంచి పాత్ర లలో ఆమె కనిపించడం మొదలుపెట్టింది. అలా అతి తక్కువ కాలంలోనే మంచి పేరు దక్కించుకున్న ఈమె ఇప్పుడు స్టార్ నటి గా ఎదిగింది.

ఇక ఆమె కూతురు సుప్రియ కూడా త్వరలో సినీరంగ ప్రవేశం చేస్తుందని వార్తలు వస్తున్నాయి. ఈమె కూతురు సుప్రియ కూడా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికీ తెలిసిందే. తల్లికి తగ్గ కూతురుగా గ్లామర్ పంచడంలో ఏమాత్రం వెనకాడడకుండా కుర్రకారును నిద్ర పోనీయకుండా చేస్తుంది. ఈ విధంగా ఈ ఇద్దరు తల్లీకూతుళ్ళు కుర్రకారును వేడెక్కిస్తు ఉంటారు. ఏ చిన్న పార్టీ అయిన ఏ చిన్న సందర్భం అయిన వెంటనే తమ చేసే అల్లరి అంతా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అందరూ తమ వైపు చూసేలా చేసుకుంటారు. ఏదేమైనా సురేఖ వాణి ఈ జనరేషన్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలకు సరిగ్గా సరిపోయే నటి అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: