టాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కువగా బయోపిక్ హవానే నడుస్తోంది. ఇక ఏకంగా ఒక వ్యక్తి కోసం ఏకంగా ఇద్దరు హీరోలు పోటీ పడి మరీ నటిస్తున్నారు. అది కూడా స్టువర్ట్ పురం దొంగ కోసం. హీరో రవితేజ, టైగర్ నాగేశ్వరరావు గా, యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ స్టువర్ట్ పురం దొంగ గా ఈ సినిమాలో పోటీపడి నటిస్తున్నారు. ఒకవేళ దొంగ అయితే అతనికి అంత క్రేజ్ ఎందుకు వచ్చింది అని ఇప్పుడు ప్రేక్షకులలో ఒక అనుమానం నెలకొంది. అసలు ఎవరు ఈ నాగేశ్వర రావు అనే ఈ విషయంపై కొన్ని విషయాలను ఇప్పుడు చూద్దాం.

1913 వ సంవత్సరంలో ఎరుకుల కులం గల ప్రజలను క్రిమినల్ గా మార్చి  జైలులో బంధించారు. ఇలా చేయడంతో వీరందరూ కలిసి ఒక కాలనీ ఏర్పరుచుకున్నారు. అదే స్టువర్ట్ పురం పేరు. ఇది గుంటూరు జిల్లాలోని బాపట్ల ప్రాంతానికి 15 మైళ్ల దూరంలో ఉన్నది. ఇక అంతే కాకుండా ఇది ప్రకాశం జిల్లా తో కూడా సంబంధం కలదు. అప్పట్లో ఈ కులస్తులకు చేసుకునేందుకు ఆ రోజుల్లో ఎటువంటి పని కూడా ఉండేది కాదట. వీరి యొక్క కుటుంబాలను పోషించాలంటే వీరు కేవలం దొంగతనం మాత్రమే చేసేవారట.

ఇక టైగర్ నాగేశ్వరరావు విషయానికొస్తే.. ఈయన కూడా  దొంగల ముఠా లో ఒకరు. ఇతని ధైర్యానికి టైగర్ అనే బిరుదును సంపాదించుకున్నాడు. ఇతను వాస్తవానికి దొంగ కాదు.. బాగా బలిసిన వాళ్ళ దగ్గర డబ్బులు కాజేసి లేని వాళ్ళ కడుపు నింపే ఒక రకమైన దొంగ. స్టువర్టుపురం లో ఈయన పుట్టి పెరగడం వల్ల, అందరూ ఈయనను స్టువర్టుపురం దొంగ అని పిలుస్తుంటారు.

అప్పట్లో ఈయన మద్రాస్ జైలు నుంచి కూడా తప్పించుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులకు ముచ్చెమటలు పట్టించే వారట. ఇక ఈయన పేరు వినగానే పోలీసులు హడలిపోయేవారట. అలా ఎంతమందికి తను కడుపు నింపాడు. అందుచేతనే ఈయనపై సినిమా తీసేందుకు అంతగా ఆరాటపడుతున్నారు మన హీరోలు.

మరింత సమాచారం తెలుసుకోండి: