సినిమాను కేవలం నాలుగు నెలలోనైనా, 30 రోజుల్లో నైనా పూర్తి చేయగలిగే స్టామినా మన తెలుగు డైరెక్టర్ లో ఉంది.అయితే ఇంత త్వరగా సినిమా డైరెక్షన్ చేయాలంటే అంత ఆషామాషీ అయిన విషయం కాదు. అందుకోసం తగ్గ ప్లానింగ్ కూడా అవసరం. అందుకోసం సరైన స్క్రిప్ట్ కూడా కావాలి. ముఖ్యంగా ఈ సినిమా కోసం హీరో హీరోయిన్ల డేట్స్ కూడా అడ్జస్ట్ కావాలి.


ముఖ్యంగా మల్టీస్టారర్ వంటి సినిమాలు అయితే చాలా వరకూ ఒక ప్లానింగ్ తో చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఒక యువ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ. నాగార్జునతో కలిసి "బంగార్రాజు" అనే సినిమాని నిర్మిస్తున్నాడు. వాస్తవానికి ఈ సినిమా 4 సంవత్సరాల క్రితమే చేయబోతున్నామని ప్రకటించారు. సోగ్గాడే చిన్నినాయన సినిమా కు ఈ సినిమా సీక్వెల్ గా రాబోతుంది అని తెలియజేశారు. కానీ ఆ తరువాత ఈ సినిమాని సెట్స్ మీదికి తీసుకెళ్లలేదు.

ఇక డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణసినిమా కథ కోసం సత్యానంద్ తో  నాలుగు సంవత్సరాలుగా ఒకే కథ మీది కుస్తీ పడుతున్నాడు ఈ డైరెక్టర్.. ఎట్టకేలకు ఓకే  అయ్యి పట్టా లెక్కిస్తున్నారు.. అంతేకాదు ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని కూడా అనుకుంటున్నట్లు సమాచారం. ఇక అన్ని అనుకున్నట్లు జరిగితే 2022 సంక్రాంతి పండుగకు కానుకగా ఈ సినిమాను విడుదల చేస్తారు అని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇకపోతే నాలుగు సంవత్సరాలుగా కష్టపడి రాసుకున్న ఒక స్క్రిప్ట్ ను కేవలం నాలుగు నెలల్లో ఎలా తీస్తాడు అనే విషయం అందరిలో చర్చనీయాంశంగా మారింది..

కానీ నాలుగు సంవత్సరాల పాటు పడ్డ కష్టం ఎంత వీలైతే అంత త్వరగా వెండితెరపై చూసుకోవాలని అనుకోవడం కూడా ఆలోచించాల్సిన విషయమే అని చెబుతున్నారు ఇండస్ట్రీ వర్గాలు నిపుణులు.. ఇక ఈ సినిమా త్వరలోనే షూటింగ్ పూర్తవుతుంది అని చెప్పడానికి కారణం ఏమిటంటే.. పక్కాగా స్క్రిప్టు రెడీ చేసి పెట్టుకోవడం, స్టోరీబోర్డ్, షెడ్యూల్స్  అన్నీ కూడా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకోవడం వల్లే సినిమా షూటింగ్ పనులు వేగంగా పూర్తి అవుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: