ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వస్తోన్న పాన్ ఇండియా సినిమా ‘పుష్ప’. భారీ బడ్జెట్ తో భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ మూవీలో బన్నీకి జోడీగా రష్మిక మందన్న నటిస్తోంది. ఈ చిత్రాన్ని క్రిస్మస్ ఫెస్టివల్ సందర్భంగా డిసెంబర్ 17న రీలేజ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. దాంతో అల్లు అర్జున అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ విషయం అలా ఉంచితే...ఇందులో అనసూయ భరద్వాజ్ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుండి అనసూయ పాత్రకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం.

పోస్టర్ లో అనసూయ లుక్ అహంకారం తో నిండిపోయి ఉంది.  మరి పాత్రకు తగ్గ పర్ఫార్మెన్స్ పక్కాగా ఇచ్చినట్లు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది అంటున్నారు కొందరు నెటిజన్లు.  ఈ మూవీలో అహంకారంతో కూడిన దాక్షాయణి పాత్రలో అనసూయా కనిపించబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ పాత్ర కోసం మొదట ఓ సీనియర్ హీరోయిన్ ను ఎంచుకున్నారట. మొదట్లో ఆ హీరోయిన్ కూడా ఒప్పుకున్నారని.. అయితే మళ్ళీ ఏమైందో ఏమో గానీ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో ఆ ఛాన్స్ ఇక రాసిపెట్టినట్టు అనసూయ చేతికి వచ్చిందని ఇండస్ట్రీలో గుసగుసలు వినపడుతున్నాయి.

ఈ వార్తలో ఎంత నిజముందో తెలియదు గానీ రంగస్థలం చిత్రంతో రంగమ్మత్తగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన అనసూయ ఇపుడు ఈ చిత్రం లో దాక్షాయిని పాత్రలో అంతకు మించిన పర్ఫామెన్స్ ఇవ్వనుంది అంటూ చెబుతున్నారు. ప్రస్తుతం పుష్ప మూవీ నుండి రిలీజ్ అయిన దాక్షాయణి పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. అయితే కొందరు ప్రేక్షకులు పాత్ర లో నటన ఉన్నప్పటికీ, ఎందుకో ఈ లుక్ అంతగా సెట్ అవ్వలేదని అంటున్నారు. అయితే అసలు ఈ లుక్ లో ఎలా ఉండనుంది అనేది తెలియాలంటే డిసెంబర్ 17 వరకు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: