టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు ఇండస్ట్రీలోకి వచ్చి నలభై ఏడు సంవత్సరాలు పూర్తయింది. దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన స్వర్గం నరకం సినిమా తో ఆయ‌న హీరో అయ్యారు. అప్పటి నుంచి 47 సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలన్ గా , హీరోగా , నిర్మాతగా కొనసాగుతున్న మోహన్ బాబు తెలుగు ప్రేక్షకులకు ఎంతో రుణపడి పోయారు. మోహన్ బాబు తర్వాత ఆయన నట వారసుడి గా ఆయన కుమారుడు మంచు విష్ణు , మంచు మనోజ్ ఇద్దరు హీరోలు అయ్యారు.

మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ ప్రసన్న సినిమాల లో నటించడంతో పాటు బుల్లితెర మీద కూడా తన సత్తా చాటుతోంది. పైగా ఇటీవ ల మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణు మా అధ్యక్షుడిగా కూడా ఎన్నికయ్యారు. పైగా రాయలసీమ లోని చిత్తూరు జిల్లా కు చెందిన మోహన్ బాబు తిరుపతి సమీపంలో విద్యా నికేతన్ విద్యా సంస్థలను స్థాపించి అలా కూడా సంపాదిస్తున్నారు. అలా సీమ ను ఆయ‌న అన్ని ర‌కాలు గా వాడుకున్నా రు.

అలాంటి మోహన్ బాబు ఇప్పుడు ఆయన సొంత జిల్లా కరువులు... వరదలు , విపత్తులతో అల్లాడుతుం టే పట్టించుకు న్న ప‌ట్టించుకున్న‌ పాపాన పోలేదు అన్న విమర్శలు వస్తున్నాయి . కలెక్షన్ కింగ్ నిన్ను ... నీ కుటుంబాన్ని నలభై ఐదు సంవత్సరాలు గా ఉన్నత స్థానంలో నిలిపినా... ఇప్పుడు మీ సొంత ప్రాంతం ఇబ్బందుల్లో ఉంది.. దయచేసి ఇక్కడికి వచ్చి ఆదుకోవాలని... తనవంతుగా స్పందించాల‌ని ప‌లువురు కోరుతున్నారు.

మోహ‌న్ బాబు తరపున... తన అభిమానులు తరఫున క‌నీసం చిత్తూరు జిల్లా వ‌ర‌ద బాధితుల‌కు అయినా వాళ్ల వంతుగా సాయం అందేలా చూడాలని ప్రతి ఒక్కరు ఉన్నారు. మరి మోహన్ బాబు ఎలా స్పందిస్తారో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: