పెద్ద హీరోల సరసన హీరోయిన్ లకు సినిమా అవకాశం రావడం అంటే వారికి పండగ లాంటి న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే సినిమా పరిశ్రమలో రాణించాలనే కలలతో ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో కష్టాలు పడి సినిమా అవకాశాలను సంపాదించుకొని హీరోయిన్స్ గా కొనసాగుతున్న ఉంటారు. అలా వారి అదృష్టం కొద్దీ పెద్ద హీరోల సరసన నటిస్తే అవకాశం వస్తే తప్పకుండా నో చెప్పరు. కానీ ఓ హీరోయిన్ మాత్రం పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశాన్ని వదిలేసుకుందనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ఇస్మార్ట్ శంకర్ సినిమా తో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది నిధి అగర్వాల్. తాను నటించిన మొదటి మాస్ చిత్రం తో మంచి హిట్ కొట్టి తన పాత్రకు కూడా మంచి మార్కులు సంపాదించుకున్న ఈమె భవిష్యత్తులో మంచి హీరోయిన్ అయ్యే అవకాశాలు కనిపించగా నిధి అగర్వాల్ పవన్ కళ్యాణ్ తో నటించే అవకాశాన్ని చేజేతులా జార విడుచుకుందనే వార్త ఇప్పుడు సోషల్  మీడియాలో వినిపిస్తుంది. అఖిల్ హీరోగా నటించిన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ చిత్రంలో హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయం అయ్యింది నిధి అగర్వాల్.

ఆ తరువాత కొన్ని సినిమాలు చేసినా కూడా ఆమెకు పెద్దగా వర్కవుట్ కాలేదు కానీ రామ్ ఇస్మార్ట్ శంకర్ సినిమా తో సూపర్ హిట్ కొట్టి టాలీవుడ్ హీరోల అందరి దృష్టిలో పడింది. దాంతోనే ఆమెకు క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ సినిమాలో నటించే అవకాశం అందుకోగా ఆ చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న మరో సినిమాలో ఆమె హీరోయిన్ గా నటించడానికి అవకాశం వచ్చింది. అయితే ఆమె డేట్స్ కారణంగా ఆ సినిమాను వదులుకోలేక తప్పలేదు. తమిళనాడులో కూడా ఆమె వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది. మరి ఇప్పటికైనా ఆమె అంత పెద్ద సినిమా ఆఫర్ ను వదులుకోకుండా డేట్స్ అడ్జస్ట్ చేసుకుని సినిమా చేస్తే మరీ మంచిది. 

మరింత సమాచారం తెలుసుకోండి: