ఆంధ్రావ‌నిలో వైసీపీ చెబుతున్న‌దే లేదా చెప్పిందే వేదం. జ‌గ‌న్ ఏం చెప్పినా ఆ మాట పాటింపున‌కు నోచుకోవాల్సిందే. ఎదురు వెళ్లిన వారికి జీవితంపై అస్స‌లు ఆశ‌లే ఉండవు. ఎందుకంటే జ‌గ‌న్ చెప్పిందంతా ప్ర‌జా క్షేమం కోసం.. ప్ర‌జ‌ల బాగు కోసం..ఆ పాటి మనం అర్థం చేసుకోకుండా ఉంటూ, మాట్లాడుతూ పోతా ఉంటే జ‌గ‌న్ స‌ర్ కు కోపం వ‌స్తాంది. అదేవిధంగా ఆయ‌న వ‌ర్గానికి ఆయ‌న త‌ర‌ఫు మ‌నుషుల‌కు వారి త‌ర‌ఫున ప‌నిచేసే గూండాల‌కు కూడా కోపం వ‌స్తాంది. వ‌చ్చినా  కూడా వ‌చ్చిన న‌ష్టం ఏం లేదు కానీ నిజం ఏద‌యినా ఉంటే చెప్ప‌క దాగుండి పోవ‌డం త‌ప్పు! నిజం వెల్ల‌డిలో లేకుండా ఉంటే అబ‌ద్ధాల ప్ర‌చారం అదే విధంగా య‌థాలాపంగా జ‌రిగిపోతుంది. అప్పుడు వైసీపీ చెప్పేవి మ‌రియు వారిని ఉద్దేశించి ఏబీఎన్ రాధాకృష్ణ చెప్పేవి ఇవ‌న్నీ చాలా అంటే చాలా వ‌ర‌కూ నిజాలు అని పైకి అనిపిస్తాయి.

వాస్త‌వానికి చాలా రోజుల కింద‌ట నుంచి చౌక ధ‌ర‌కే వినోదం అన్న రూల్ ఒక‌టి త‌నదైన రైమింగ్ లో వినిపిస్తున్నారు జ‌గ‌న్. అవును దీన్నెవ్వ‌రూ కాద‌న‌రు. ఇదే స‌మ‌యంలో సాక్షి పేప‌ర్  మేం రూపాయికే అమ్మాల‌ని చెబితే అమ్ముతారా అని అంటోంది టీడీపీ. ప్రారంభంలో రూపాయి ప‌త్రిక కాస్త ఇప్పుడు ఐదు రూపాయ‌ల యాభై పైసలు అయింది. మ‌రి! ఆ పేప‌ర్ రేటు ఎందుకు త‌గ్గించ‌రు. ఎందుకు చౌక ధ‌ర‌కే స‌మాచారం అని నినాదం ఒక‌టి వినిపించ‌రు అని కూడా ప్ర‌శ్నిస్తోంది టీడీపీ.




"ఇక భార‌తీ సిమెంట్ క‌ట్ట 2014లో 150 రూపాయ‌లు, 2019లో 250 రూపాయ‌లు, 2021లో 440 రూపాయ‌లుగా ఉంది. కానీ మారుతున్న ధ‌ర‌ల‌కు అనుగుణంగా టికెట్ ధ‌ర‌లు మాత్రం మార‌కూడదు. 2014లో టికెట్ ధ‌ర 80,100 రూపాయ‌లుగా ఉండేది. 2019లో 100,150,200 రూపాయ‌లుగా ఉండేది. 2021లో మాత్రం 50,20,10 రూపాయులుగా ఉంది. మ‌రి! మారుతున్న ధ‌ర‌ల‌కు అనుగుణంగా థియేట‌ర్ రేటు పెర‌గాలా త‌గ్గాలా?" ఇదీ టీడీపీ వాద‌న. కానీ వైసీపీ మాత్రం ఎట్టి ప‌రిస్థితుల్లోనూ టికెట్ ధ‌ర‌లు తగ్గించేదే లేద‌ని అంటోంది. థియేట‌ర్లు మూత ప‌డినా కూడా త‌మ‌కు ప‌ట్టింపే లేద‌న్న విధంగా, కుటుంబాలు రోడ్డున ప‌డినా కూడా త‌మ‌కు సంబంధం లేని విధంగా మాట్లాడుతుండ‌డంతో వివాదం నానాటికీ తీవ్ర రూపం దాల్చుతోంది.




మరింత సమాచారం తెలుసుకోండి: