చిత్ర పరిశ్రమలో బ్యాక్ గ్రౌండ్ ఉన్నా అదృష్టం మాత్రం కలిసి రావాలి.. ఎందుకంటే బడా బ్యాక్ గ్రౌండ్‌లో ఎంట్రీ ఇచ్చినప్పటికీ కేవలం సక్సెస్ మాత్రమే సినీ జీవితాన్ని నిర్ణయిస్తుంది. ఇండస్ట్రీలో విజయం అందుకుంటే సాధారణ హీరో.. స్టార్ హీరోగా మారిపోతారు. సరైన సక్సెస్ లేకపోతే స్టార్ హీరో సైతం అవకాశాలు లేక ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సినీ వారసులుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన హీరోలు కొంతమంది వారి సత్తాను చాటుకోలేక వెనుదిరిగిపోయారు. అలాంటి వారిలో సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కొడుకు రమేష్ బాబు కూడా ఒకరు.

తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణ లాంటి భారీ బ్యాక్ గ్రౌండ్.. ఇండస్ట్రీలోకి రావాలంటే ఇంతకంటే ఇంకేం కావాలని అనుకుంటూ ఉంటాము. ఇక చైల్డ్ ఆర్టిస్టుగా అప్పటికే కెమెరా ముందు నటించిన అనుభవం.. భయం బెరుకు లేకుండానే రమేష్ బాబు తెలుగు చిత్ర పరిశ్రమ పరిచయమయ్యారు. ఆయన హీరోగా సరైన విజయాన్ని అందుకోలేకపోయారు. అయితే తన వారసుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రమేష్ బాబును హీరోగా నిలబెట్టెందుకు కృష్ణ చాలా ప్రయత్నాలు చేశారు. ఇక చిత్ర పరిశ్రమలో ఉన్న స్టార్ డైరెక్టర్లు అందరూ కూడా రమేష్ బాబుతో సినిమా చిత్రీకరించారు. కానీ.. ఆయన విజయాన్ని మాత్రం అందుకోలేకపోయారు.

ఈ నేపథ్యంలోనే రమేష్ బాబు హీరోగా భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఒక సినిమా మాత్రం ఆర్థిక సమస్యల కారణంగా చివరికి రిలీజ్ కాలేదు. అయితే సూపర్ స్టార్ కృష్ణ ఆయన వారసుడు రమేష్ బాబు హీరోలుగా 1996లో ఆహో విక్రమార్క అనే ఒక సినిమా షూటింగ్ ప్రారంభించారు. ఈ చిత్రానికి సాగర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను భారీ అంచనాల మధ్య చిత్రీకరించగా.. ఆర్థిక సమస్యల కారణంగా అర్ధాంతరంగా ఆగిపోయింది. ఈ మూవీతో కృష్ణ కొడుకు రమేష్ బాబు మంచి విజయం అందుకుంటారని సినీ ప్రముఖులు భావించారు. కానీ పరిస్థితులు అనుకూలించక ఈ సినిమా విడుదలకు నోచుకోకుండా ఆగిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: