హృతిక్ రోషన్.. అమ్మాయిల కలల రాకుమారుడు అలాంటిది ప్రేమించకుండా ఎవరు మాత్రం ఉంటారు.. ఈ రోజు ఆయన పుట్టిన రోజు కాబట్టి  ఈయనకు సంబంధించిన ఒక విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. హృతిక్ రోషన్ ను ఎవరు ప్రేమిస్తారు..? మీరు ప్రేమిస్తున్నట్లు అయితే రీ ట్వీట్ చేయండి.. ఈ రోజు ఆయన పుట్టిన రోజు కదా అంటూ ఒక ట్వీట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. ఇక ఇది చూసిన చాలామంది కేవలం 20 నిమిషాల్లోనే కొన్ని వేల మంది రీ ట్వీట్లు పంపడం జరిగింది. ఇక అలా ఈ ట్వీట్ కాస్త సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారుతోంది.



ఇదిలా ఉండగా హృతిక్ రోషన్ భారతీయ సినీ నటుడిగా బాలీవుడ్ స్టార్ హీరో గా గుర్తింపు తెచ్చుకున్నారు.. తన సినిమాల ద్వారా విభిన్న పాత్రలను పోషించి నృత్య నైపుణ్యాలకు ప్రసిద్ధిచెందాడు. అంతేకాదు భారతదేశ సినీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న హృతిక్ రోషన్ తన సినిమాల ద్వారా ఉత్తమ నటుడిగా నాలుగు అవార్డులు, ఆరు ఫిలింఫేర్ అవార్డులు ,ఉత్తమ నటుడిగా కూడా అవార్డులను సొంతం చేసుకున్నాడు. అంతేకాదు 2012 నుండి ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ 100 మంది జాబితాలో ఎన్నోసార్లు ఈయన పేరు కనిపించడం గమనార్హం..
హృతిక్ రోషన్ ఎక్కువగా తన తండ్రి రాకేష్ రోషన్ తోనే కలిసి పనిచేసే వారు..1980 లలో బాలనటుడు  గా ఎన్నో చిత్రాలలో కనిపించాడు.. అంతే కాదు తన తండ్రితో కలిసి నాలుగు సినిమాలకు సహాయ దర్శకుడిగా కూడా పనిచేశారు. ఇక మొదటి సారి కహో నా ప్యార్ హై  2000 సంవత్సరం లో హీరోగా అడుగు పెట్టి ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. తెలుగులో కూడా రెండు మూడు సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యారు హృతిక్ రోషన్. హృతిక్ రోషన్ సుస్సానే ఖాన్ ను 2000 సంవత్సరంలో వివాహం చేసుకొని 2014లో ఆమెతో విడాకులు కూడా తీసుకున్నాడు. ఇక వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: