కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ తీసిన సోగ్గాడే చిన్ని నాయన సినిమా ఆరేళ్ళ క్రితం ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ హిట్ కొట్టింది. నాగార్జున డ్యూయల్  చేసిన ఈ సినిమాకి సీక్వెల్ గా ప్రస్తుతం బంగార్రాజు మూవీ తెరకెక్కింది. నాగార్జున, తనయుడు నాగచైతన్య తో కలిసి చేస్తున్న బంగార్రాజు సినిమాలో రమ్యకృష్ణ ప్రధాన పాత్ర చేస్తుండగా నాగ చైతన్యకి జోడీగా కృతి శెట్టి యాక్ట్ చేస్తోంది. కళ్యాణ్ కృష్ణ తీసిన ఈ సినిమాని అన్నపూర్ణ స్టూయోస్, జీ స్టూడియోస్ సంస్థలు కలిసి నిర్మించాయి.

ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్ అందరినీ ఎంతో ఆకట్టుకుని సినిమాపై మంచి అంచనాలు ఏర్పరిచాయి. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని నేడు కొద్దిసేపటి క్రితం యూట్యూబ్ లో రిలీజ్ చేసారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునే అంశాలతో రూపొందింది. ట్రైలర్ ని బట్టి చూస్తే మొదటి భాగం మాదిరిగా ఈ సినిమా కూడా మంచి యాక్షన్ తో పాటు మాస్, కమర్షియల్ హంగులతో తెరకెక్కినట్లుగా కనపడుతోంది. బంగార్రాజు స్వర్గంలోకి అందమైన అమ్మాయిల మధ్య ఎంట్రీ ఇచ్చే సీన్ లో 'బంగార్రాజు బావగారు చూపులతోనే ఊచకోత కోసేస్తారు మీరు' అనే డైలాగ్ తో ట్రైలర్ ఆరంభం అవుతుంది.

'మాట్లాడుకొవడానికైతే అమ్మాయిని, కొట్టేసుకోవడానికైతే మగాడిని తీసుకురమ్మని ఆఫర్ ఇచ్చావంట కదరా' 'వాసివాడి తస్సాదియ్యా' అంటూ నాగచైతన్య చెప్పే డైలాగ్స్ ట్రైలర్ లో ఎంతో బాగున్నాయి. కృతి శెట్టి డైలాగ్స్, అందం, రమ్యకృష్ణ యాక్టింగ్, మంచి యాక్షన్, థ్రిల్లింగ్, ఎంటర్టైనింగ్ సీన్స్ తో పాటు అదిరిపోయే బీజీఎమ్, విజువల్స్ తో రూపొందిన బంగార్రాజు ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో దూసుకెళ్తోంది. ఇక ట్రైలర్ రిలీజ్ తరువాత సినిమాపై అందరిలో మరింతగా అంచనాలు పెరగడం ఖాయం అనే చెప్పాలి. మరి సంక్రాంతి పండుగ కానుకగా ఈనెల 14 న రిలీజ్ కానున్న బంగార్రాజు మూవీ ప్రేక్షకాభిమానుల అంచనాలు ఎంతవరకు అందుకుంటుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: