సినీ ఇండస్ట్రీలో బ్రేకప్‌లు కామన్ అయ్యాయి. ప్రేమించి.. లివింగ్ రిలేషన్‌లో కొనసాగుతున్న వారు.. పెళ్లి చేసుకుని కొన్నేళ్లపాటు జీవితం సాగించిన వారు.. ఇలా చాలా మంది సినీ నటీనటులు బ్రేకప్ బాట పడుతున్నారు. ఇది ఇప్పటి నుంచే కాదు.. మొదట్లోనూ జరిగింది. బ్యాక్ టు బ్యాక్ బ్రేకప్‌లతో బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారుతుంది. తాజాగా ఇదే బాటన బాలీవుడ్ స్టార్ హీరోహీరోయిన్లు చేరారు. బాలీవుడ్ హాట్ కపుల్ మలైనా, అర్జున్ కపూర్ బ్రేకప్ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ ఏడాది పెళ్లి చేసుకుందామనుకున్న ఈ జంట.. సడన్‌గా బ్రేకప్ అవుతున్నారనే వార్త సెన్సెషనల్ అవుతుంది.


సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ జంట.. ఈ మధ్య ముద్దు ముచ్చట్లతో మునిగితేలారు. ప్రేమలో పీకల్లోతూలో మునిగిన వీరు.. లివింగ్ రిలేషన్‌లో ఉన్నారని సమాచారం. పెళ్లి చేసుకుందామని అనుకున్న ఈ జంట.. ఒక్కటవ్వకుండా విడిపోతున్నారని టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ హ్యాపెనింగ్ కపుల్ అర్జున్ కపూర్, మలైకా అరోరా గత 4 ఏళ్లుగా రిలేషన్‌లో ఉన్నారు. ఏమైందో తెలియదు.. 4 ఏళ్లు ప్రేమకు స్వస్తి పలుకుతున్నట్లు బాలీవుడ్‌ మీడియాలో తెగ హడావిడి చేస్తోంది. మోస్ట్ ఇంట్రెస్టింగ్ కపులైన వీరిద్దరు విడిపోతున్నారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


మలైకా కంటే అర్జున్ 12 ఏళ్లు చిన్నోడు. వీరిద్దరు కొద్ది రోజులుగా ఒకరినోకరు మాట్లాడుకోవడం లేదని, గత 6 రోజులుగా మలైనా ఇంటి నుంచి బయటకు రాలేదని టాక్ వినిపిస్తోంది. ఇన్ని రోజులైనా.. అర్జున్ కపూర్ మలైకాను చూడటానికి కూడా వెళ్లలేదని చెబుతున్నారు. ఈ ఏడాది పెళ్లి చేసుకుంటామని చెప్పిన వీరు.. ఇంతలో బ్రేకప్ వార్త ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అర్జున్ కపూర్ చెల్లెలు రియా కపూర్.. మలైకా ఇంటి దగ్గర్లోనే ఉంటారు. అర్జున్ రియా వాళ్ల ఇంటికి వెళ్లిన ప్రతిసారి మలైకా ఇంటికి వెళ్తుంటాడు. కానీ వారం రోజులుగా వీరిద్దరి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇద్దరు ఫ్యామిలీ డిన్నర్స్ కి అటెండ్ అయ్యే వారు.. కానీ ఇప్పుడా అడ్రస్ లేకుండా పోయింది. ఇటీవలే ఈ జంట మాల్దీవులకు వెళ్లారు. అక్కడి నుంచి వచ్చాకే మలైకా, అర్జున్ విడిపోతున్నారంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: